టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని సంతోషించే లోపే.. అంతే నష్టాలు కూడా ఉన్నాయని పలుమార్లు ప్రూవ్ అయ్యింది. చాలా పరిశ్రమల్లో టెక్నాలజీని ఉపయోగించి డేటా ను పైరేట్ చెయ్యడం మనం చూసాము.అయితే తెలుగు సినిమాల విషయంలోనే ఇది ఎక్కువగా ప్రూవ్ అయ్యింది. ఎలా అంటారా.. సినిమా ఎడిటింగ్ దశలో ఉన్నప్పుడు కొంతమంది యూనిట్ సభ్యులు సరదాగా వెళ్లి ఎవ్వరికీ తెలీకుండా ఆ సినిమాలను రికార్డ్ చేసి ఫ్రెండ్స్ కు షేర్ చేస్తుంటారు. అది కాస్తా ఒక్కరి దగ్గర ఆగదు కదా.. వెబ్ సైట్ లో పెట్టెయ్యడం వరకూ వెళ్ళిపోతుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగూ పిరసీ నుండీ తప్పించుకోవడం కష్టం. కానీ సినిమా రిలీజ్ కాకుండానే లీక్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
అలా రిలీజ్ కు ముందే పైరసీ భారిన పడిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :