Tollywood: మరో రికార్డ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్!

  • September 16, 2021 / 05:55 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు నెటిజన్ల నుంచి వేర్వేరు అభిప్రాయాలు వినిపిస్తాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ నంబర్ వన్ హీరోల రేసులో ఉండగా ఆగష్టు నెలకు సంబంధించి ఆర్మాక్స్ మీడియా సర్వేలో మహేష్ బాబు నంబర్ 1 స్థానంలో నిలిచారు. గతంలో కూడా మహేష్ నంబర్ 1 స్థానంలో నిలవగా జాబితాలో సూపర్ స్టార్ అదే స్థానాన్ని కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

మహేష్ తొలి స్థానంలో నిలిస్తే రెండవ స్థానాన్ని స్టార్ హీరో అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రభాస్ మూడో స్థానంలో నిలవగా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉండగా రామ్ చరణ్ ఆరో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏడో స్థానంలో నాని, ఎనిమిదో స్థానంలో విజయ్ దేవరకొండ ఉండగా మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదో స్థానంలో, వెంకటేష్ పదో స్థానంలో ఉన్నారు. బాలకృష్ణ, నాగార్జున, శర్వానంద్ లకు టాప్ టెన్ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus