Tollywood: ఈసారి నిర్మాతలే షూటింగులు ఆపేయనున్నారా..?

  • July 18, 2022 / 08:20 AM IST

టాలీవుడ్ లో మరోసారి ‘సమ్మె’ సైరన్ మోగనుంది. ఈసారి ఏకంగా నిర్మాతలే షూటింగుల బంద్ కి పిలుపునివ్వబోతున్నారని సమాచారం. నిన్న మొన్నటివరకు వేతనాలు పెంచమంటూ సినీ కార్మికులు బంద్ పేరుతో బెదిరించారు. ఇప్పుడు నిర్మాతలే షూటింగ్ లు వద్దనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు రోజులుగా నిర్మాతలంతా కలిసి మీటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సమస్యల గురించి, నిర్మాతలుగా తాము పడుతున్న కష్టనష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు. మూతబడుతున్న థియేటర్లు, పెరిగిపోతున్న హీరోల రెమ్యునరేషన్స్, ఓటీటీ ఎఫెక్ట్ ఇలా అన్ని విషయాలపై చర్చలు జరుగుతున్నాయి.

ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే సినిమా షూటింగ్ లను కొంతకాలం ఆపేసి.. నిర్మాతలుగా తమ డిమాండ్స్ ఏంటో వినిపించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం నుంచి షూటింగ్స్ ఉండకపోవచ్చు. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఈ విషయంలో నిర్మాతలపై ఏక తాటిపై ఉండి.. సమ్మె సైరన్ మోగించారు. నిర్మాతలే.. షూటింగులు వద్దంటే అది మామూలు విషం కాదు. సినిమా రంగంపై ఆధారపడి బతుకుతున్న వేల మంది ఇబ్బందుల్లో పడతారు.

ఇప్పటివరకు నటీనటులు, కార్మికులు, టెక్నీషియన్స్ షూటింగ్లను బహిష్కరించారు. ఇప్పుడు ఏకంగా నిర్మాతలే ఆ నిర్మాత తీసుకోబోతున్నారు. మరిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి!

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus