Producers Guild: కీలక నిర్ణయం తీసుకున్న ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌.!

రకరకాల కారణాలు చెప్పి షూటింగ్లు ఆపేశారు టాలీవుడ్ నిర్మాతలు.కొన్ని ద్విభాషా చిత్రాలు మాత్రం షూటింగ్లు జరుపుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా.. షూటింగ్స్‌ పున:ప్రారంభంపై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటివరకు ఆపిన షూటింగ్స్ను తిరిగి ప్రారంభించనున్నట్లు నిర్మాతల మండలి వెల్లడించింది. ఆగస్టు 1 నుండి తెలుగు సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయిందని, వేతనాలు భారీగా పెరిగిపోయాయని, ప్రోడ్యుసర్స్‌ కౌన్సిల్స్‌, ఫిలిం చాంబర్‌ కలిసి మూవీ షూటింగ్స్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

ఇప్పుడైతే ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. ఈ విషయం పై నిర్మాతలు దిల్‌ రాజు, సి కల్యాణ్‌ లు మీడియాతో ముచ్చటించారు. సెప్టెంబర్‌ 1 నుండి పూర్తి స్థాయిలో షూటింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆగస్ట్‌ 25 నుండి విదేశాల్లో షూటింగ్ జరపుకోవాల్సిన సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నట్టు కూడా వారు తెలిపారు. నిజానికి షూటింగ్లు ఆపేయడం వల్ల.. కోట్లకు కోట్లు నష్టపోయేది నిర్మాతలే అని తెలిసినా వారు దానికి మొగ్గు చూపారు అంటే దాని వెనుక ఎంత కథ ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీని ముఖ్య ఉద్దేశం హీరోల పారితోషికాలు తగ్గించడమే అని తేలింది. అయితే స్టార్ హీరోలను వీరు ఇబ్బంది పెట్టలేదని వినికిడి. మిడ్ రేంజ్ హీరోల పారితోషికాలు మాత్రమే తగ్గించమని కోరినట్టు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ.. దాదాపు నిజమే అనే చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఏదైతేనేం తిరిగి షూటింగ్లు ప్రారంభం కానున్నాయి.. ఇండస్ట్రీ అంతా హ్యాపీనే..!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus