సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన పోrn వీడియోల కేసులో ఓ టాలీవుడ్ నాయిక అరెస్టు అయ్యింది. మోడల్, టీవీ ప్రజెంటర్, హీరోయిన్గా టాలీవుడ్, బాలీవుడ్లో వివిధ సినిమాల్లో నటించిన గెహన వశిష్ట్‌ను ముంబయి పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. పోrn వీడియోల వ్యవహారంలో ఆమె కీలక వ్యక్తి అని తెలుస్తోంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయేసరికి గెహనా పోrn వీడియోలు చేయడం మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. రహస్యంగా తన పోర్టల్ లో ఆ వీడియోలను అమ్మకానికి పెట్టింది.
గెహనా ఇటీవల ప్రారంభించిన వెబ్ సైట్లోకి వెళ్లాలంటే ముందుగా ₹2 వేలు చెల్లించాలి. విదేశీయులైతే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందట. ఇండియాలో ఇలాంటి వెబ్సైట్లపై బ్యాన్ ఉన్నా, ఆమె అనధికారికంగా నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ముంబయి పోలీసులు గెహనాను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా వివరాలు సేకరించి ఆమెను అరెస్టు చేశారట. ఆమె చేసిన పని చట్టరీత్యా నేరం కావడతో శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.
మోడల్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన గెహనా.. ఆ రంగంలో మంచి గుర్తింపే దక్కించుకుంది. ఆ తర్వాత నటిగా బాలీవుడ్, టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించింది. ప్రత్యేక గీతాల్లోనూ ఆడిపాడింది. అయితే అవేవీ ఆమెకు అనుకున్నంత ఫేమ్‌ను తీసుకురాలేదు. దీంతో ఇటీవల కాలంలో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. దీంతో ఆమె ఇటువైపు వచ్చిందంటున్నారు.