సోషల్ మీడియాలో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతూ ఉండటం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఒకప్పుడు ఇలాంటి ఫోటోలు చూడాలి అంటే మ్యాగ్జైన్..ల వంటివే బెస్ట్ సోర్స్ గా ఉండేవి. అలా మ్యాగ్జైన్..లలో వచ్చే హీరోయిన్ల ఫోటోలను, చిన్నప్పటి ఫోటోలను.. గ్లామర్ ప్రియులు కట్ చేసుకుని తమ కలెక్షన్స్ లిస్ట్ లో పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు చేతిలోనే ప్రపంచం(ఫోన్) ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తరించిన తర్వాత..
హీరోయిన్ల రేర్ పిక్స్, అన్ సీన్ పిక్స్ వంటివి సేకరించడం అనేది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇలాంటి ఫోటోలతో సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు పజిల్స్ వంటివి పెట్టుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఓ టాలీవుడ్ హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చాలా క్యూట్ గా ఉంది. ఆమె మరెవరో కాదు ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత పట్నాయక్.
ఆ తర్వాత ఈమె ‘పంచతంత్ర కథలు’ ‘నెట్’ ‘సీతా రామం’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ‘సీతా రామం’ సినిమాలో ఈమె చేసిన వేశ్య పాత్ర చాలా ఎమోషనల్ గా, అందరితో కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుంది. ఇక నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె చెల్లెలి పాత్ర పోషించింది. దానికి కూడా మంచి మార్కులు పడ్డాయి.
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగల్’ సినిమాలో కూడా ఈమె చాలా ముఖ్యమైన పాత్రని పోషించింది. అందుతున్న సమాచారం ప్రకారం.. అందులో ఈమె నక్సలైట్ పాత్రని పోషించినట్లు తెలుస్తుంది. ఆ సినిమా ఈమె కెరీర్ కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఇవి పక్కన పెట్టేసి.. (Actress) ప్రణీత పట్నాయక్ చైల్డ్ హుడ్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!