Soggade Chinni Nayana: ఆ కారణంగానే హీరోయిన్ సోగ్గాడే చిన్నినాయన ను సినిమాను రిజెక్ట్ చేసిన చేసిందా..!

సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్స్ కొంత మంది హీరోలతో నడించాలని కలలు కంటారు..అలాంటి వారిలో అప్పట్లో శోభన్ బాబు అయితే ఇప్పటి హీరోయిన్స్ నాగార్జున అని చెప్పడంలో ఏటువంటి సందేహం అవసరంలేదు. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందరూ ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకున్న వారే. అయితే ఓ హీరోయిన్ మాత్రం అలాంటి ఛాన్స్ వస్తే ఏకంగా సినిమాను రిజెక్ట్ చేసిందట. అమె ఎవరో తెలుసుకుందాం.

అక్కినేని నాగార్జునతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తారు. 64ఏళ్ల వయసులోనూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు. మన్మథుడిగా కుర్రహీరోలు సైతం కుళ్లుకునేలా బాడీని మెయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఓ మన్మథుడు.. ఓ కింగ్, నవ సామ్రాట్ ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం ఈ వార్త మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు హీరోయిన్ గా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది నదియా.

ఆమె వాస్తవానికి నాగార్జునతో (Soggade Chinni Nayana) సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్రకు తగ్గట్లు కొంచెం రొమాంటిక్ యాంగిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ కారణంతోనే నదియా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఈ పాత్ర కోసం ఆ తర్వాత రమ్య కృష్ణని అప్రోచ్ అయ్యారట మేకర్స్. ఒకవేళ నాగార్జున – నదియా కాంబినేషన్ సెట్ అయి ఉంటే మాత్రం.. నో డౌట్ సోగ్గాడే చిన్నినాయన సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాదు అంతకుమించిన రేంజ్ లో బాక్సాఫీసును షేక్ చేసేది.

ప్రస్తుతం నాగార్జున తన 99వ చిత్రం ‘నా సామిరంగ’ సినిమా తీస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సినిమాలోని తన లుక్ ని కూడా రివీల్ చేశాడు. టైటిల్ కి తగ్గట్టే నాగార్జున రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించాడు. ఈ మూవీతో కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ బిన్నీ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు అల్ల‌రి న‌రేష్, రాజ్‌త‌రుణ్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus