బెంగాలీ నటి రూపా గంగూలీ అందరికీ సుపరిచితమే. బెంగాలీ, హిందీ సినిమాలు చూసిన వారికి మాత్రమే కాదు తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది. ‘శశిరేఖ శపథం’ ‘నా ఇల్లే నా స్వర్గం’ ‘ఇన్స్పెక్టర్ భవాని’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. అయితే ఈమె వ్యక్తిగత జీవితంలో చాలా కష్టాలు పడినట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. 1992లో మెకానికల్ ఇంజనీర్ ద్రుభో ముఖర్జీని పెళ్లాడింది రూపా గంగూలీ.
1997లో ఈ దంపతులకి ఆకాశ్ అనే బాబు జన్మించాడు. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఎక్కువ కాలం వీరు కలిసి ఉండలేదు. 2007లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొంత కాలానికి రూపా… బెంగాలీ సింగర్ దిబ్యేందు ముఖర్జీని ప్రేమించి రెండో పెళ్లికి రెడీ అయ్యింది. వీరిద్దరూ చాలా కాలం కలిసి జీవించారు. రూపా ఇంట్లోనే దిబ్యేందు కూడా చాలా కాలం పాటు ఆమెతో కలిసున్నాడు.
అయితే కొన్నాళ్ల తర్వాత అతనికి సహజీవనం బోర్ కొట్టేసినట్టు ఉంది. వెంటనే తప్పుకున్నాడు. దీంతో రూపా మళ్ళీ ఒంటరైంది. అందుకే ఈమె మూడు సార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ప్రయత్నించిందట. కానీ మూడు సార్లు బ్రతికినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన భర్తతో విడాకులు తీసుకోక ముందు రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట.
కానీ దేవుడు బ్రతికించాడు అని చెప్పింది. దిబ్యేందు ముఖర్జీతో బ్రేకప్ అయ్యాక కూడా చనిపోవాలని అనుకుందట. కానీ అప్పుడు కూడా తన వల్ల కాలేదు అని చెప్పుకొచ్చింది. ఇక తన భర్త నుండి కూడా ఈమె (Roopa Ganguly) ఒక్క రూపాయి కూడా భరణంగా తీసుకోలేదట.