Tollywood: టాలీవుడ్ హీరోలకు డేంజర్ బెల్.. 2026లో ఆ సీన్ ఉండదట!

ఇన్నాళ్లు టాలీవుడ్ అంటే హీరోలదే రాజ్యం. వాళ్ల కటౌట్ ఉంటే చాలు, కథ లేకపోయినా కలెక్షన్లు వచ్చేవి. లెగసీ పేరు చెప్పుకుని, ఫ్యామిలీ ఇమేజ్ వాడుకుని దశాబ్దాలుగా బండి లాగించేసిన స్టార్స్ చాలామందే ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. ఆడియన్స్ మైండ్ సెట్ లో వచ్చిన మార్పు చూస్తుంటే మన స్టార్లకు వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో రాబోయే సునామీకి ఇప్పుడే సంకేతాలు అందుతున్నాయి.

Tollywood

ఇండస్ట్రీలో ఇన్నాళ్లు నడిచిన స్టార్ కల్చర్ ఇప్పుడు కనుమరుగయ్యే దశకు వచ్చింది. కేవలం హీరో ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ నమ్ముకుని సినిమాలు తీస్తే కుదరదని రీసెంట్ రిజల్ట్స్ గట్టిగా చెబుతున్నాయి. రొటీన్ మాస్ మసాలా, అర్థం లేని ఎలివేషన్లు ఉంటే జనం థియేటర్ వైపు చూడటం మానేశారు. వాళ్లకు కావాల్సింది బలమైన కథే తప్ప, హీరో బిల్డప్ కాదు. ఈ విషయం గ్రహించని హీరోలకు కష్టకాలం మొదలైనట్లే.

రాబోయే 2026 నాటికి టాలీవుడ్ లో భారీ మార్పులు రాబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అప్పటికి వేళ్ళ మీద లెక్కపెట్టే హీరోలు మాత్రమే రేసులో ఉంటారట. ఎవరైతే మారుతున్న ట్రెండ్ కు తగ్గట్లు తమను తాము మలచుకుంటారో వాళ్లే నిలబడతారు. పాత చింతకాయ పచ్చడి లాంటి ఫార్ములా కథలను, రొటీన్ కమర్షియల్ హంగులను నమ్ముకున్న వాళ్లు మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వక తప్పదు.

దీనికి మరో ప్రధాన కారణం బడ్జెట్లు. సినిమా తీయడం ఇప్పుడు తడిసి మోపెడవుతోంది. కేవలం హీరో పేరు చూసి వందల కోట్లు పెడితే, అవి వెనక్కి వస్తాయన్న గ్యారెంటీ లేదు. నిర్మాతలకు ఇప్పుడు స్టార్ డమ్ కంటే స్క్రిప్ట్ మీదే నమ్మకం పెరుగుతోంది. అందుకే హీరో ఎవరు అనే దానికంటే, కంటెంట్ ఏంటి అనే దానికే ఓటు వేస్తున్నారు. స్టార్స్ కూడా పారితోషికాల కంటే కథల మీద దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది.

భవిష్యత్తులో ఇండస్ట్రీ మొత్తం రైటర్స్, డైరెక్టర్ల చేతిలోకి వెళ్లబోతోంది. గ్రిప్పింగ్ నేరేషన్, రిలేటబుల్ ఎమోషన్స్ ఉన్న సినిమాలే బాక్సాఫీస్ ను శాసిస్తాయి. హీరోలు కేవలం ఆ కథలో ఒక పాత్రగానే మిగులుతారు తప్ప, సినిమా మొత్తం వాళ్ళ భుజాల మీద నడవదు. ఇది మన స్టార్లకు మింగుడు పడని నిజమే అయినా, ఒప్పుకోక తప్పని పరిస్థితి. రాబోయే రోజుల్లో హీరోలకు గట్టి పరీక్షే ఎదురుకానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus