Sujeeth: ‘సాహో’ దర్శకుడు సుజీత్ ను అవమానించిన టాలీవుడ్ నిర్మాత..!

శర్వానంద్ హీరోగా వచ్చిన ‘రన్ రాజా రన్’ చిత్రంతో దర్శకుడిగా మారిన సుజీత్.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుని మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. ఆ తర్వాత ప్రభాస్ తో ‘సాహో’ వంటి పాన్ ఇండియా మూవీ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. నిజానికి ఇతను హీరో అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడట. అందుకోసం ఎన్నో స్టూడియోస్ లో ఆడిషన్స్ కు హాజరయ్యేవాడట. కానీ తర్వాత తనలో హీరో కాదు దర్శకుడు ఉన్నాడన్న విషయాన్ని గ్రహించి ఆ దిశగా అడుగులు వేసాడట సుజీత్.

ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్ ను కూడా తెరకెక్కించి మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తుండగా ఓ నిర్మాత ఇతన్ని ఘోరంగా అవమానించాడట. ఈ విషయాన్ని సుజీత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చాడు. సుజిత్‌ మాట్లాడుతూ… “కెరీర్‌ ప్రారంభంలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.ఎన్నో మాటలు కూడా పడ్డాను.నేను డైరెక్టర్ కాక ముందు ఓ నిర్మాత.. ‘ఏంటి? నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా? సినిమా తీయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు ఇక్కడ. నేను రాసిస్తున్నా.. నువ్వు జీవితంలో డైరెక్టర్ కాలేవు.

ఒకవేళ డైరెక్టర్ అయినా హిట్ కొట్టలేవు’ అని నానా మాటలు అన్నాడు. అప్పుడు అతని ముందు నేను సరే అని చెప్పి వచ్చేసాను. తర్వాత డైరెక్టర్ గా మారి హిట్‌ కొట్టాను. తర్వాత ఆ నిర్మాత ఆఫీసు నుండే కాల్‌ వచ్చింది. సర్‌ మిమ్మల్ని కలవాలట అని ఎవరో ఆ కాల్ లో నాతో మాట్లాడారు.దాంతో నేను ‘సర్‌ (సుజీత్ తనను తాను ఉద్దేశించి) చాలా బిజీగా ఉన్నారు’ అంటూ సమాధానం ఇచ్చాను. ఇప్పుడు ఆయన్ని చూస్తే నవ్వొస్తుంది కానీ కోపం రావట్లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus