మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న దర్శకుడు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. మోహన్ లాల్ నటించిన ఈ సూపర్ హిట్ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యింది. అయితే తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను రాంచరణ్ కొనుగోలు చేసాడు. కొన్ని మార్పులు చేసి తీస్తే మన తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉందని మెగాస్టార్ చెప్పడంతో చరణ్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయడానికి తెలుగులో ఏ దర్శకుడు ముందుకు రావడం లేదు. మొదట సుకుమార్ అన్నారు.. కానీ ఆ దర్శకుడికి రీమేక్ చేసే ఇంట్రెస్ట్ చెప్పేశాడట. అటు తరువాత వంశీ పైడిపల్లి అన్నారు.. అతను మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటున్నాడు.. దానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు కానీ.. ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలింది హరీష్ శంకర్, వి.వి. వినాయక్. అయితే హరీష్ శంకర్ అయితే పర్ఫెక్ట్ అని చిరు చెప్పారట. ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని తెలుగులో ‘చిక్కడు దొరకడు’ (తమిళ్ లో ‘జిగర్తాండ’) గా డబ్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేసి హిట్టు కొట్టాడు. దాంతో హరీష్ శంకర్ తో చేయించాలి అని చరణ్ కూడా ఫిక్స్ అయ్యాడట. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడంతో ఈ ప్రాజెక్ట్ చెయ్యలేనని.. పవన్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక మీతో సినిమా చేయడానికి రెడీగా ఉంటానని.. అందుకోసం ఓ స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకున్నానని చిరుకి చెప్పాడట. హరీష్ రిక్వెస్ట్ ను అర్థం చేసుకున్న చిరు అలాగే.. అని చెప్పారట. దీంతో ఈ రీమేక్ బాధ్యతల్ని దర్శకుడు వినాయక్ కు అప్పగించినట్టు సమాచారం.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus