Raj Tarun: రాజ్ తరుణ్ కి స్టార్ ట్యాగ్.. నిర్మాత కామెంట్స్ వైరల్!
- April 15, 2025 / 12:35 PM ISTByPhani Kumar
రాజ్ తరుణ్ (Raj Tarun) కెరీర్ ప్రారంభంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని క్రేజ్, మార్కెట్ పెంచుకున్న హీరో. ఆ తర్వాత కూడా ‘ఈడో రకం ఆడో రకం’ (Eedo Rakam Aado Rakam) వంటి హిట్లు, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ (Kittu Unnadu Jagratha) వంటి యావరేజ్ సినిమాలు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి. కానీ తర్వాత ఇతన్ని వరుసగా ప్లాపులు వెంటాడాయి. ఇప్పుడైతే వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ.. ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేక అల్లాడుతున్నాడు. గత ఏడాది నుండి చూసుకుంటే రాజ్ తరుణ్ నుండి 4 సినిమాలు వచ్చాయి.
Raj Tarun

అవే ‘నా సామి రంగ'(స్పెషల్ రోల్), ‘పురుషోత్తముడు’ ‘తిరగబడరసామి’ (Tiragabadara Saami) ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). ఇందులో ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) తప్ప మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అటు బాక్సాఫీస్ వద్ద కానీ, ఓటీటీ పరంగా కానీ.. ఆ సినిమాలకి బిజినెస్ ఏమీ రికవరీ కాలేదు. మరోపక్క అతని మాజీ ప్రేయసి లావణ్య చేసిన రచ్చ అందరికీ తెలుసు. వాటితో కూడా అతను నలిగిపోయాడు.

నిన్న మొన్నటి వరకు రాజ్ తరుణ్ కి ఓటీటీ మార్కెట్ అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా పడిపోయినట్టు ఇన్సైడ్ టాక్. అతని లేటెస్ట్ మూవీ ‘పాంచ్ మినార్’ కి కూడా ఓటీటీ డీల్స్ ఏమీ రావడం లేదు అనేది ఇన్సైడ్ టాక్. అయితే ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక ఇటీవల జరిగింది. దీనికి నిర్మాత ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ (Sai Rajesh). మారుతి (Maruthi Dasari) వంటి వారు హాజరయ్యారు.

ఈ క్రమంలో ఎస్.కె.ఎన్… రాజ్ తరుణ్ కి ఓ స్టార్ ట్యాగ్ ను కట్టబెట్టారు. రాజ్ తరుణ్ కి ‘స్పాంటేనియస్ స్టార్’ అనే స్టార్ ట్యాగ్ ఇవ్వాలని, టైటిల్ కార్డ్స్ లో అతని పేరు ముందు ‘స్పాంటేనియస్ స్టార్’ అనే ట్యాగ్ వేయాలని నిర్మాతల్ని కోరారు ఎస్.కె.ఎన్ (SKN).













