కమల్ హాసన్ (Kamal Haasan) కొత్త లుక్ వచ్చింది చూశారా? ఇద్దరు యంగ్ డైరక్టర్లతో ఆయన నడుస్తూ వస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. అది ఓ సినిమా అనౌన్స్‌మెంట్ అని మీకు తెలిసే ఉంటుంది. కమల్ హాసన్ ఇటీవల ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన ఆ సినిమా జూన్ 5న థియేటర్లలోకి రానుంది. దీంతో కొత్త సినిమాకు ఓకే చెప్పేశాడు.
‘KH 237’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాతో స్టంట్ డైరెక్టర్స్ అన్బు – అరివు దర్శకులుగా తెరకు పరిచయం కానున్నారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషల్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను జులై ఆఖరులో లేదా ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభిస్తారు. అన్బు – అరివు గురించి తెలిసినవాళ్లకు ఇది భారీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా అని చెబితే పెద్దగా ఆశ్చర్యపోరు.
ఇక ఈ యాక్షన్ సినిమా కోసం కమల్ బరువు తగ్గి సన్నని లుక్‌లోకి మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే శరీరాకృతి విషయంలో మార్పలు కనిపిస్తున్నాయి. ఆ ఫొటోలో అలానే ఉన్నాడు కూడా. అన్బు – అరివు గతంలో కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ (Vikram) సినిమా కోసం పని చేశారు. అందులో వాళ్లు డిజైన్ చేసిన స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా అనే కాదు ఇప్పుడు చేసిన ‘థగ్ లైఫ్’, రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) లాంటి సినిమాలకు కూడా వారే యాక్షన్ సీక్వెన్స్‌లు రూపొందించారు.
అలాంటి ఇద్దరూ కలసి ఇప్పుడు నేరుగా సినిమాను డైరక్ట్ చేస్తున్న సినిమాను ఇంకా ఎంత యాక్షన్ డోస్‌ను పెంచుతారో చూడాలి. నిజానికి చాలా రోజుల ముందే ఓ అగ్రహీరోతో సినిమా చేస్తారని అన్బరివు గురించి వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కమల్‌తో సినిమా ఓకే అయింది.