ఫార్మ్ కోల్పోయిన స్టార్ డైరెక్టర్ వెబ్ సిరీస్ చేస్తాడట

శ్రీను వైట్ల సినిమాలంటే కేర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. హీరోల ఇమేజ్ తగ్గట్టుగా అద్భుతమైన కామెడీ ట్రాక్స్ తో కడుపుబ్బా నవ్వించడం ఆయన స్పెషాలిటీ. కెరీర్ బిగినింగ్ నుండి ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకున్న శ్రీను వైట్ల అద్భుతమైన హిట్స్ అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన వెంకీ, ఢీ, రెడీ వంటి చిత్రాలు భారీ హిట్స్ అందుకున్నాయి. ఇక మహేష్ తో చేసిన దూకుడు బ్లాక్బస్టర్ హిట్ అందుకోగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. దీనితో ఎన్టీఆర్ శ్రీను వైట్లకు అవకాశం ఇచ్చారు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాద్షా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. తన రైటింగ్ టీమ్ కోనా వెంకట్, గోపి మోహన్ తో విభేదాలు రావడంతో ఆయన వారు లేకుండా ఆగడు సినిమా చేశారు. ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తరువాత రామ్ చరణ్ తో చేసిన బ్రూస్లీ కూడా పరాజయం పొందింది. ఆ తరువాత ఆయన చేసిన మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు కూడా ప్లాప్స్ గా మిగిలిపోవడంతో, ఆయనకు సినిమా కష్టాలు మొదలయ్యాయి.

ఆయనతో మూవీ చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. కాగా మంచు విష్ణుతో ఢీ కి సీక్వెల్ సిద్ద చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ఏమిటంటే శ్రీను వైట్ల ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ఓ టి టి జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకోవాలనేది ఆయన ఆలోచన అని తెలుస్తుంది.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus