ఇటీవల చిన్న సినిమాగా విడుదలైనా బలగం సినిమా మంచి రెస్పాన్స్ తో ప్రేక్షకుల ఆదరణ పొంది సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సినిమాలు, కామెడీ షోలతో అలరించిన నటుడు వేణు టిల్లు బలగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ మూవీకి దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాణ సారథ్యం వహించారు. ఈ ఆధునిక కాలంలోనూ తెలంగాణ పల్లెల్లోని సాంప్రదాయాలు, మూఢనమ్మకాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చిత్ర కథను ఎంతో అద్భుతంగా మలిచాడు దర్శకుడు వేణు.
ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి సహా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గాను భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ చిత్రానికి లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్, ఓన్కియో ఫిలిం అవార్డ్స్ వచ్చాయి. మొత్తానికి బలగం చిత్రం ఇప్పటి వరకు దాదాపు 8 అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
ఇంత అద్భుతమైన చిత్రానికి ముందుగా ప్రియదర్శిని కాకుండా వేరొకరిని హీరోగా అనుకున్నారట. ఈ చిత్రంలో ముందుగా దర్శకుడు వేణునే హీరోగా నటించాలని అనుకున్నారట. కానీ వేణు హీరోగా నటిస్తే ప్రేక్షకులు అంతగా సినిమాని ఆదరించారని భావించి తప్పుకున్నారట. ఇక ఆ తర్వాత చిత్ర యూనిట్ హీరో శ్రీ విష్ణుకి చిత్ర కథను వినిపించడం జరిగిందట.
బలగం మూవీ స్టోరీ శ్రీ విష్ణుకు బాగా నచ్చినప్పటికీ తెలంగాణ యాసలో మాట్లాడటం నాకు చాలా కష్టమవుతుందని భావించి బలగం చిత్ర కథ రిజెక్ట్ చేశారట శ్రీ విష్ణు. అలా శ్రీ విష్ణు బలగం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని చేతులారా చేజార్చుకున్నారు.ఆ తర్వాత ఈ చిత్రానికి గాను ప్రియదర్శి ని హీరోగా సెలెక్ట్ చేయడం జరిగిందట.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్