కృష్ణ తేనె మనసులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దానికి ముందు కొన్ని చిన్న చిన్న పాత్రలు చేశారు కృష్ణ. గూడచారి 116 సినిమాతో మంచి హిట్ ని పొంది అప్పటి నుండి కూడా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ కెరియర్ లో 340 సినిమాలకు పైగా చేశారు. దర్శకుడిగా 16 సినిమాలు తీశారు. కృష్ణ ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియోని ఏర్పరచుకున్నారు పద్మాలయ స్టూడియో ను హైదరాబాద్ లో కృష్ణ నెలకొల్పారు.
కృష్ణ నటించిన సింహాసనం సినిమా మీకు గుర్తుందా..? అప్పట్లో కృష్ణ నటించిన బ్రహ్మాస్త్రం, కృష్ణ గారడి, మహా మనిషి సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అప్పుడు కృష్ణ కి ఒక ఆలోచన వచ్చింది. తన ఆస్థాన రచయిత అయిన త్రిపురనేని మహారధికి ఆలోచన చెప్పారు. ఆయనే కథని రెడీ చేశారు. అత్యాధునిక సాంకేతిక నిపుణులతో ఈ సినిమాని రెండు భాషల్లో తీసుకురావాలని నిర్ణయించారు. ఈ సినిమాని స్వయంగా కృష్ణ గారే నిర్మించి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ సినిమా టైంలో ఇండస్ట్రీలో ఉండే పెద్దలు ఈ సినిమాపై ప్రయోగం చేయొద్దని (Star Hero) కృష్ణకి చెప్పారు. కానీ కృష్ణ వినలేదు. అలానే కృష్ణవేగం చూసి కొన్ని సంస్థలు అయితే భయపడ్డాయి. ఈ సినిమా కోసం ఆయన ఇంటిని తాకట్టు పెట్టారు. పైగా ఈ సినిమా కోసం పద్మాలయ స్టూడియోస్ లో రూపాయలు రూ. 0.5 కోట్లతో సెట్ వేశారు. అలానే సింహాసనం సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లందరికీ కూడా ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ లభించింది. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పనిచేయాలని నాన్ వెజ్ భోజనాలని రుచికరంగా కృష్ణ ఏర్పాటు చేశారు.
బప్పిలహరిని ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు కృష్ణ. పాటలు బాలసుబ్రమణ్యం పాడారు. ఈ సెట్ ని చూడడానికి ఇండస్ట్రీలో ఉండే పెద్దలు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. రెండు వెర్షన్లు కి రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యింది. బిజినెస్ అయితే బాగానే జరిగింది. హిందీ లో కూడా సినిమా బాగానే ఆడింది. మొదటి వారం రూ.1.5 కోట్ల షేర్ ని ఈ మూవీ వసూల్ చేసింది. ఫుల్ రన్ లో ఈ మూవీ ఏకంగా రూ.4.5 కోట్ల షేర్ నిరాబట్టి హిట్ అయింది. 41 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది సింహాసనం.