టాలీవుడ్ స్టార్ హీరో గురించి ఈ విషయం మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. సాహో, రాధేశ్యామ్ సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినా ప్రభాస్ తో 300, 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ జాతకాలు చెప్పే వ్యక్తి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు దేవునిపై నమ్మకం ఉందని పూజలు చేస్తారని వేణుస్వామి కామెంట్లు చేశారు. హీరోలు, రాజకీయ నాయకులు సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తప్ప అందరూ జాతకాలను నమ్ముతారని వేణుస్వామి కామెంట్లు చేశారు. ప్రభాస్ జాతకాలను నమ్మడు కానీ జాతకాలు నమ్మే సినిమా చేశాడని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వేణుస్వామి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య బాబు చాలామంచి వ్యక్తి అని సబ్జెక్ట్ పరంగా మాట్లాడగల వ్యక్తి ఆయన అని వేణుస్వామి కామెంట్లు చేశారు.

బాలయ్య నుంచి నేను కూడా కొత్త విషయాలను తెలుసుకోగలుగుతానని వేణుస్వామి చెప్పుకొచ్చారు. శాస్త్రాల విషయంలో బాలయ్యకు మంచి జ్ఞానం ఉందని వేణుస్వామి కామెంట్లు చేశారు. వామాచారంలో బాలయ్య పూజలు చేస్తారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ పూజలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయని ఆయన తెలిపారు. అయితే పూజలు పర్ఫెక్షన్ తో చేయాలని వేణుస్వామి కామెంట్లు చేశారు. అలా చేయకపోతే చేసేవాళ్లకు ఆ పూజలు మంచివి కాదని వేణుస్వామి అన్నారు.

నా దగ్గరకు వచ్చిన వాళ్లకు నేను జవాబుదారినని అందరికీ నేను జవాబుదారిని కాదని వేణుస్వామి అన్నారు. వేణుస్వామి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, రాజమౌళి జాతకాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో విచిత్రమైన జాతకాలు అని వేణుస్వామి అన్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus