టాలీవుడ్ స్టార్ హీరోలు (Heroes) ఇప్పుడు పూర్తిగా బిజీ అయిపోయారు. గతంలో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు పూర్తి చేయడం సాధారణమైనా, ఇప్పుడు ఒక సినిమా షూటింగ్‌కు ఒక్కో స్టార్ రెండు సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. అదే సమయంలో పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేస్తున్నందున, ప్రతీ ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్, దీర్ఘ కాలం అవసరమవుతోంది. దీంతో కొత్త దర్శకులు, మధ్యస్థాయి నిర్మాతలు ఈ స్టార్ హీరోల డేట్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ది రాజా సాబ్ (The Rajasaab), సలార్ 2, ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ (Spirit), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రతీ ప్రాజెక్ట్ రూ.300 కోట్లు దాటి ఉండటంతో అంచనాలు మాములుగా లేవు. అలాగే వీటిని పూర్తిచేయడానికి 2027 వరకు టైం పడనుంది. ఎన్టీఆర్ (Jr NTR) కూడా వార్ 2 (War 2), డ్రాగన్, దేవర 2, నెల్సన్ (Nelson Dilip Kumar) డైరెక్షన్‌లో మరో సినిమా వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో తన డేట్స్‌ను పూర్తిగా బుక్ చేసేశాడు. రామ్ చరణ్ (Ram Charan) మాత్రం బుచ్చిబాబు (Buchi Babu Sana) డైరెక్షన్‌లో పెద్ధి (Peddi) సినిమాతో పాటు, సుకుమార్ (Sukumar) సినిమాలకు అంగీకారం తెలిపాడు.
ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికలలో బిజీగా ఉన్నప్పటికీ, OG (OG Movie), హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలను పూర్తిచేయడంపై దృష్టి పెట్టాడు. కానీ ఈ సినిమాల తర్వాత కొత్త ప్రాజెక్టులకు స్పేస్ ఉండదని అంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం నెక్స్ట్ అట్లీతో (Atlee Kumar) ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, త్రివిక్రమ్ (Trivikram) మైతోళాజికల్ చిత్రంతో 2026 వరకు బిజీగా ఉంటాడని తెలుస్తోంది.
మహేష్ బాబు (Mahesh Babu) విషయానికి వస్తే, రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో SSMB29 చేస్తున్నాడు. ఇది ప్రపంచ స్థాయి అడ్వెంచర్ మూవీ కావడంతో, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కలిపి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ లైన్‌అప్ చూస్తే, ఇతర దర్శక నిర్మాతలు ఈ స్టార్ హీరోలతో (Heroes) పని చేయాలంటే 2027 వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్ న్యూస్. ప్రతీ ఏడాది స్టార్ హీరోల భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.