ఎక్కువ సినిమాలను లైన్ లో పెట్టిన బడా హీరోలు

కరోనా కంటే ముందు వరకు కూడా అగ్ర హీరోలు ఏడాదికి ఒక సినిమా తప్పితే మరో ప్రాజెక్ట్ ఉసే ఎత్తేవారు కాదు. కొందరైతే ఒక సినిమా విడుదలైన తరువాత గాని మరో సినిమా గురించి ఆలోచించే వారు కాదు. కానీ లాక్ డౌన్ అనంతరం మన హీరోలు ఆ ఫార్మాట్ ను వదిలేశారు. గతంలో ఎప్పుడు లేనంత స్పీడ్ గా ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల నుంచి రాబోయే సినిమాలపై ఒక లుక్కేస్తే..

రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న రాధేశ్యామ్ తో కలిపి ప్రభాస్ 6 సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 21వ సినిమాగా సలార్ రూపొందుతోంది. 22వ ప్రాజెక్ట్ గా ఓం రావత్ ఆదిపురుష్, 23వ సినిమాగా నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్. సిద్దార్థ్ ఆనంద్ తో 24వ సినిమా చేస్తున్న ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ తో 25వ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ సినిమాకు దర్శకుడు ఇంకా సెట్టవ్వలేదు.

నేటితరం సీనియర్ హీరోలలో మంచి స్పీడ్ మీద ఉన్నాడు మెగాస్టార్. కొరటాల శివ.. ఆచార్య 152వ సినిమాగా వస్తుండగా..153వ సినిమాగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్, 154వ సినిమాగా వేదాళం రీమేక్ సినిమాను (మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇక 155వ సినిమా బాబీతో చేయాలని ఫిక్స్ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో అనంతరం 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో.. 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ తో సెట్టయ్యింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో 32వ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రామ్ చరణ్ RRR కంటే ముందే ఆచార్య సినిమాలో స్పెషల్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అనంతరం 15వ ప్రాజెక్ట్ గౌతమ్ తిన్ననూరితో, 16వ సినిమాను శంకర్ తో చేయవచ్చని టాక్. 17వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రావచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనంతరం 27వ సినిమాగా అయ్యప్పనుమ్ కొశీయుమ్ రాబోతోంది. క్రిష్ 28వ సినిమా, హరీష్ శంకర్ తో 29వ సినిమా. ఇంకా సురేందర్ రెడ్డితో 30వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus