బ్లాక్ బస్టర్ సినిమాల పరిస్థితి అంత దారుణంగా ఉందా?

కొన్నేళ్ల క్రితం వరకు థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు రిలీజైన చాలారోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ అయ్యేవి. అయితే ప్రేక్షకుల అభిరుచి మారడంతో ప్రస్తుతం పెద్ద సినిమాలు థియేటర్లలో ఒకటి లేదా రెండు వారాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతోంది. ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలవుతూ ఉండటంతో తొలిరోజు కూడా థియేటర్లలో నిర్మాతలు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ ఉండటం లేదు. తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెరగగా పెరిగిన టికెట్ రేట్లకు అనుగుణంగా కలెక్షన్లు మాత్రం పెరగడం లేదు.

నైజాం ఏరియాలో ఈ మధ్య కాలంలో హిట్ టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో విఫలయ్యాయి. నిర్మాతలు ఈ సినిమాలు భారీ మొత్తంలో కలెక్షన్లను సాధించాయని చెబుతున్నా ఈ సినిమాలు వాస్తవంగా సాధించిన కలెక్షన్లు వేరే విధంగా ఉన్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత పెద్ద సినిమాల హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. అయితే ఆంధ్రలోని కొన్ని ఏరియాలలో పెద్ద సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతుంటే మరికొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడం లేదు.

మరోవైపు రోజురోజుకు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందువల్ల స్టార్ హీరోలు రెమ్యునరేషన్లను తగ్గించుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోని పక్షంలో భారీ బడ్జెట్ సినిమాలలో ఎక్కువ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. మరోవైపు పెద్ద సినిమాల నిర్మాతలకు వడ్డీల రూపంలో భారం అంతకంతకూ పెరుగుతోంది. టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్లను తగ్గించుకోవడానికి సిద్ధపడతారో లేదో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ హీరోలు రెమ్యునరేషన్లను పెంచితే మాత్రం ఆ హీరోల కెరీర్ కు ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి. సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్ల భారం వల్ల పెద్ద సినిమాలను కొనుగోలు చేసే బయ్యర్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus