ఈ టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోలు ఓటు వేసేది ఎక్కడో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్, ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్, ఇతర హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ హీరోల రెమ్యునరేషన్లు భారీ స్థాయిలో ఉండగా ఈ హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ హీరోలు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహేష్, ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్ ఓటు వేసే పోలింగ్ బూత్ లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు (Mahesh Babu) జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 165లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చరణ్ జూబ్లీహిల్స్ క్లబ్ లో పోలింగ్ బూత్ నంబర్ 149లో ఓటు హక్కును వినియోగించుకుంటారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓబుల్ రెడ్డి స్కూల్ లో పోలింగ్ బూత్ నంబర్ 150లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సమాచారం అందుతోంది.

బన్నీ విషయానికి వస్తే బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ నంబర్ 153లో ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. ప్రభాస్ మణికొండలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్టార్ హీరోలలో ఎంతమంది హీరోలు ఓటు హక్కును వినియోగించుకుంటారో తెలియాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది. అన్ని పార్టీలకు విజయావకాశాలు ఉండగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఓటు హక్కును వినియోగించుకోకపోతే కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం కాగా విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కష్టపడుతున్నాయి. ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus