Bimbisara: సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరోస్?

సాధారణంగా కొన్ని సినిమా అవకాశాలు కొందరు వద్దనుకుంటేనే మరికొందరికి వెళ్తాయి.ఇలా ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలను మరొకరు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కోవకు చెందుతారు నటుడు కళ్యాణ్ రామ్.గత కొంతకాలం నుంచి ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కెరియర్ కు బింబిసార సినిమా ఊపిరి పోసిందని చెప్పాలి.

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట అనే దర్శకుడి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించగా ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుంది. ఇక ఈ సినిమా చూసిన ఎంతోమంది ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో డైరెక్టర్ కి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి.కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ఈయన పరిచయం చేస్తున్న ఎంతో మంది దర్శకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర దర్శకులకు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే వశిష్ట డెబ్యూ మూవీగా బింబిసార సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇలా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ముందుగా కళ్యాణ్ రామ్ కంటే నలుగురు హీరోల వద్దకు వెళ్లి వచ్చింది.ఇలా ఆ నలుగురు హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమాలో నటించే అవకాశం కల్యాణ్ రామ్ కి వచ్చిందని చెప్పాలి. ముందుగా డైరెక్టర్ వశిష్ట ఈ సినిమా కథతో యంగ్ హీరో నితిన్, రామ్, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలను సంప్రదించి కథ వినిపించారట. అయితే ఈ సినిమాని ఈ నలుగురు హీరోలు రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం కల్యాణ్ రామ్ కు వచ్చింది. మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఈ హీరోలు మిస్ చేసుకున్నారని చెప్పాలి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus