ఈ ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల డ్రీమ్ రోల్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో హీరోయిన్లు ఉండగా ఈ హీరోయిన్లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు తమను తాము ప్రూవ్ చేసుకునే పాత్రల కోసం తెగ కష్టపడుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ డ్రీమ్ రోల్స్ గురించి వెల్లడిస్తూ ఆ రోల్స్ లో నటించే అవకాశం కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న రష్మిక (Rashmika) భవిష్యత్తులో సౌందర్య (Soundarya) బయోపిక్ తీస్తే అందులో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.

సినిమాల్లోకి రాకముందే నేను సౌందర్య యాక్టింగ్ కు వీరాభిమానినని బాల్యం నుంచి ఆమె సినిమాలు చూస్తూ తాను పెరిగానని రష్మిక వెల్లడించారు. మా నాన్న కూడా నేను కొన్నిసార్లు సౌందర్యలా కనిపిస్తానని అన్నారని రష్మిక పేర్కొన్నారు. మరో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) టిల్లూ స్క్వేర్ (Tillu Square) సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించాలని కోరుకుంటున్నానని అనుపమ వెల్లడించారు.

నా రోల్ ను చూసి నేను భలే చేశానని ఫ్యాన్స్ అనుకోవాలని ఆమె వెల్లడించారు. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) పూర్తిస్థాయి కామెడీ రోల్ లో నటించాలని భావిస్తున్నారు. పూర్తిస్థాయి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాలని నేను కోరుకుంటున్నానని స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) వెల్లడించడం గమనార్హం. మరో హీరోయిన్ రీతూవర్మ (Ritu Varma) రా ఏజెంట్ రోల్ లో నటించాలని ఆసక్తి ఉందని తెలిపారు.

ప్రతి స్టార్ హీరోయిన్ ఒక్కో తరహా భిన్నమైన పాత్రకు ఓకే చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా కూడా టాప్ లో నిలుస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లకు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది. సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఈ హీరోయిన్లు ఆశ్చర్యపరుస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus