Ajith: కోలీవుడ్‌లోకి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్‌ ఎంట్రీ… అదిరిపోయే కాంబో పట్టేశారుగా!

టాలీవుడ్‌లో మోస్ట్‌ ప్రెస్టీజియస్‌, అండ్‌ భారీ సినిమాలు తీసే ప్రొడక్షన్‌ హౌస్‌గా మైత్రీ మూవీ మేకర్స్‌కు పేరు. ఫ్రెండ్స్‌ కలసి ఏర్పాటు చేసిన ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ భారీ సినిమాలు, చిన్న సినిమలు అని తేడా లేకుండా ముందుకు సాగుతోంది. వరుస విజయాలు, భారీ వసూళ్లకు అగ్ర నిర్మాణ సంస్థగా మారింది. అయితే ఇప్పుడు తన ప్రయాణాన్ని టాలీవుడ్‌కి మాత్రమే పరిమితం చేయకుండా… పక్క పరిశ్రమలకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కోలీవుడ్‌లో తొలి సినిమాను దాదాపు ఓకే చేసుకుంది అంటున్నారు.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమాను దాదాపు ఓకే చేసుకున్నారు అని చెబుతున్నారు. ఈ సినిమాకు అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు అని కోడంబాక్కం టాక్‌. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ అంటే.. మొన్నీమధ్య విశాల్‌తో ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా చేసిన దర్శకుడే. తొలి సినిమాతోనే అదిరిపోయే విజయం అందుకున్న అధిక్‌ ఇప్పుడు తన అభిమాన హీరో అజిత్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ సంపాదించారు అన్నమాట.

‘మార్క్‌ ఆంటోనీ’ ప్రచారం సమయంలో అధిక్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ… అజిత్‌ మీద తన అభిమానాన్ని చాలా సార్లు గొప్పగా చెప్పుకొచ్చారు. ఇప్పుడే అదే అజిత్‌తో రెండో సినిమాను ఓకే చేసుకున్నాడు. అజిత్‌ను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకురావాలో తనకు తెలుసని, అభమానులు గర్వపడేలా ఆ సినిమా ఉంటుంది అని గతంలో అధిక్‌ చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టే ఒక మాస్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్ధం చేశారు అని సమాచారం.

అజిత్‌కి (Ajith) ఉన్న మార్కెట్ చూసుకుంటే అధిక్‌ చేసే సినిమా విజయం సాధిస్తే… పెద్ద పెద్ద సినిమాల రికార్డులు బద్దలవ్వడం ఈజీ అని పరిశ్రమ వర్గాల అంచనా. ఎందుకంటే విశాల్‌తో చేసిన ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమానే రూ. 100 కోట్లు వసూలు చేసింది కాబట్టి. చూద్దాం మరి అజిత్‌ – అధిక్‌ ఏం చేస్తారో?

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus