ప్రభ కుమారుడి పెళ్లిలో సందడి చేసిన స్టార్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభ ఒకరు. తాజాగా ఈమె ఇంట పెళ్లి బాజాలు మోగాయని తెలుస్తోంది. రమేష్ వివాహ వేడుకలు హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు సినీ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు. నటి ప్రభ రమేష్ దంపతులకు రాజా రమేష్ ఒకరే కొడుకు. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం రమేష్ మరణించిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచి కొడుకు బాధ్యతలను ప్రభ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం రాజా రమేష్ అమెరికాలో స్థిరపడ్డారు. ఇక ఈయనకు ఇటీవల విజయవాడకు చెందినటువంటి సాయి అపర్ణ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇలా వీరి వివాహ వేడుకలు బుధవారం హైదరాబాద్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయని తెలుస్తుంది. ఇక ఈ పెళ్లి వేడుకలకు కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు కూడా హాజరై సందడి చేశారు.

ఈ వివాహ వేడుకలలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి వెంకటేష్ చిరంజీవి మురళీమోహన్, సుమన్ వంటి స్టార్ హీరోలు అందరూ కూడా హాజరై సందడి చేశారు. ఇలా ఈ వివాహ వేడుకలలో కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాకుండా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా సందడి చేశారు. అలాగే రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా ఒకే చోట కనిపించి సందడి చేశారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus