స్మాల్ స్క్రీన్ పై యాంకర్లుగా సక్సెస్ అయిన హీరోలు?

వెండితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం బుల్లితెరపై కార్యక్రమాలలో కూడా కొనసాగుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకొని బుల్లితెర పై యాంకర్లగా కొన్ని కార్యక్రమాలకు పలువురు స్టార్ట్ చేశారు. అయితే మరి బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి స్టార్ హీరోలు ఎవరో ఇక్కడ చూసేద్దాం… నాగార్జున ఈయన బిగ్ బాస్ కార్యక్రమం తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి రెండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున మూడవ సీజన్ నుంచి ప్రస్తుతం వరకు కొనసాగుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా స్టార్ మాలో ప్రసారమవుతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనే పేరిట ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3 కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అయితే ఈ కార్యక్రమం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నేచురల్ సార్ నాని బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వీరితోపాటు మరొక యంగ్ హీరో అయినటువంటి రానా కూడా నెంబర్ వన్ యారి అంటూ ఒక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం ఆహలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమం రెండు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సీజన్ ప్రసారం అవుతుంది ఇలా వీరంతా కూడా వెండితెరపై హీరోలుగా మంచిగా సక్సెస్ అందుకోవడమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా యాంకర్లుగా ఎంతో మందిని అందుకున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus