Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సూపర్ లుక్ కోసం లైపో సక్షన్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్

సూపర్ లుక్ కోసం లైపో సక్షన్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్

  • January 19, 2017 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ లుక్ కోసం లైపో సక్షన్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్

సినీ ప్రపంచంలో అభినయంతో పాటు అందానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అందానికి మెరుగులు దిద్దుకొని గ్లామర్ ఫీల్డ్ లో ప్రవేశిస్తారు. వయసు పెరుగుతున్నకొద్దీ నటీనటుల్లో మార్పులు సహజం. అవి కొందరిలో అధికంగా కనిపిస్తాయి. ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగాలనే ఉద్దేశంతో, మరింత అందంగా కనిపించాలని శరీరాన్ని కోతలకు గురిచేస్తుంటారు. బాడీలో పేరుకు పోయిన కొవ్వును లైపో సక్షన్ అనే చికిత్స ద్వారా తొలిగించుకొని స్లిమ్ గా తయారవుతుంటారు. అలా టాలీవుడ్ లో బరువు తగ్గడానికి లైపో సెక్షన్ ను ఆశ్రయించిన స్టార్స్ పై ఫోకస్..

చిరంజీవిChiranjeeviమెగాస్టార్ చిరంజీవి చిత్రపరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్లపాటు బాడీని బాగా మెయిన్ టైన్ చేశారు. హిట్లర్ సినిమా సమయానికి బాగా లావు అయ్యారు. ఆ తర్వాత వ్యాయామం చేసి కొంచెం తగ్గారు. మృగరాజు చిత్రానికి మళ్ళీ లావు అయ్యారు. దీంతో బరువు తగ్గాలని కసితో లైపో చేయించుకొని ఇంద్ర చిత్రంలో అదిరే లుక్ తో ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్NTRయంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం నుంచే కొంచెం బొద్దుగా ఉంటారు. ఆయన ఎంచుకొనే కథలకు ఆ లుక్ బాగా సెట్ అయ్యేది. కానీ తాను రాను రాను బరువు పెరిగిపోయారు. రాఖీ చిత్రంలో అయితే షేప్ పూర్తిగా అవుట్ అయిపోయారు. ఇక ఎక్సర్ సైజ్ తో లాభం లేదనుకొని లైపో చేయించుకొని యమదొంగలో అందరినీ ఆశ్చర్యపరిచారు.

నయనతారNayanataraమొదట్లో బొద్దుగా, ముద్దుగా కనిపించిన నయనతార స్లిమ్ కావడం వెనుక లైపో మంత్రం ఉంది. ఈ చికిత్స తో మంచి వర్కవుట్ చేసుకొని ఫిట్ బాడీ ని సొంతం చేసుకుంది. దక్షిణాది సినీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది.

మంచు విష్ణుManchu Vishnuడైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సినిమాల్లోకి బలంగానే ఎంట్రీ ఇచ్చాడు. నేటి తరం ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే బరువు తగ్గాలని ఆలస్యంగా తెలుసుకొని సలీం చిత్రానికి ముందు లైపో చేయించుకొని సూపర్ లుక్ ని సాధించాడు.

రాశిRaasiభారీ అందాల సుందరి రాశి. బరువుగా ఉన్నప్పటికీ అద్భుతంగా డ్యాన్స్ లు చేసి అలరించింది. పెళ్లి చేసుకొని సినిమా పరిశ్రమకు దూరం కావడంతో బరువు బాగా పెరిగారు. సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. చివరికి లైపో ని ఆశ్రయించి బరువు తగ్గించుకున్నారు. టీవీ షో చేశారు. త్వరలో కొత్త లుక్ తో వెండి తెరపై మెరవనున్నారు.

హరికృష్ణHari Krishnaటాలీవుడ్ సీతయ్య నందమూరి హరికృష్ణ కూడా బరువు తగ్గేందుకు లైపో చేయించుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం కాకుండా అధిక బరువుతో గుండె జబ్బులు రాకుండా, ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలని ఈ చికిత్సను చేసుకున్నారు. పూర్తిగా పూర్వపు లుక్ ని మార్చుకున్నారు.

సునీల్Sunilహాస్యనటుడు సునీల్ తన బాడీపై కూడా జోకులు వేసుకొని నవ్వించారు. హీరోగా మారిన తర్వాత సిక్స్ ప్యాక్ తెచ్చుకొని ఔరా అనిపించారు. ఈయన మార్పు వెనుక లైపో సహకారం కూడా ఉంది. పూలరంగడు చిత్ర సమయంలో లైపో చేయించుకొని కసరత్తు చేసి విజయం దక్కించుకున్నారు.

దివ్యవాణిDivyavaaniనట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి దివ్యవాణి అనేక హిట్స్ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో అందం, అభినయంతో ఆకట్టుకుంది. పెళ్లి అయిన తర్వాత డైట్ కంట్రోల్ తప్పింది. దీంతో బరువు పెరిగింది. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని లైపో చేయించుకొని పూర్వపు లుక్ తెచ్చుకుంటోంది.

శ్రీహరిSrihariరియల్ స్టార్ శ్రీహరి కండల రాయుడు. విలన్ పాత్రల నుంచి హీరోగా మారి క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా కెరీర్ లో పాత్రలను మార్చుకుంటున్న తరుణంలో బాడీ ని మార్చుకునేందుకు లైపో చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువకాలం నిలువలేదు లివర్ క్యాన్సర్ తో మరణించారు.

ఆర్తి అగర్వాల్Aarthi Agarwalఆర్తి అగర్వాల్ బొద్దుగా ఉన్నప్పటికీ అందరూ ఆదరించారు. అనేక హిట్లు అందించారు. టాలీవుడ్ లోకి సైజ్ జీరో బ్యూటీలు రావడంతో వారికి పోటీ ఇవ్వాలంటే సన్నగా ఉండాలని అమెరికాలో లైపో చేయించుకుంది. కానీ ఈ ఆపరేషన్ వల్ల ఆమెకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది. సినిమాల్లో నటన కొనసాగించాలనే తపన ఆమె ప్రాణం తీసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Chiranjeevi
  • #Chiranjeevi 150 Film
  • #Chiranjeevi movies
  • #Divyavaani

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

Anil Ravipudi, Chiranjeevi: ‘మెగా 157’ కోసం చిరుని బుల్లితెరపై కూడా దింపేస్తున్నాడు..!

Anil Ravipudi, Chiranjeevi: ‘మెగా 157’ కోసం చిరుని బుల్లితెరపై కూడా దింపేస్తున్నాడు..!

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

13 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

17 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

17 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

22 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

22 hours ago

latest news

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

7 mins ago
స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

17 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

17 hours ago
ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

18 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version