Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

ఏ ఒక్క సినిమాను ఉద్దేశించో, ఏ ఒక్క హీరోని ఉద్దేశించో, ఏ ఒక్క దర్శకుడిని ఉద్దేశించో, ఏ ఒక్క నిర్మాత (రిలీజ్‌ చేసే వారితో సహా) ఉద్దేశించో కాదు.. ఈ డైలాగ్‌. అందరినీ ఉద్దేశించి అన్నది. ఈ మాట అంటున్నది మేం కూడా కాదు. ఆయా సినిమా ఫలితాలు చూశాక ఇండస్ట్రీలో వస్తున్న గుసగుసలు, ఫ్యాన్స్‌లో వస్తున్న రుసరుసలు అర్థం ఇలా ఉంది మరి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన రెండు సినిమాలకు హైపే ఇబ్బంది పెట్టింది అనే ప్రాథమిక టాక్స్‌ మీరు కూడా వినే ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ లుక్కేసుకుంటే..

Tollywood

ఏ సినిమా మనిషి అయినా.. ‘మా సినిమా బాగుంటుంది.. వచ్చి చూడండి’ అని ప్రమోట్‌ చేస్తుంటారు. అది ఏ రూపంలో అయినా ఫర్వాలేదు. ఎవరైనా తమ ప్రొడక్ట్‌ గురించి ఇలానే చెబుతారు. చెప్పాలి కూడా. కానీ ‘మా సినిమా మీరు ఊహించిన దాని కంటే బాగుంటుంది’ అని చెబితే ఇబ్బందే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌ వాసులు కొంతమంది మీడియాను, సగటు ప్రేక్షకుడిని ‘అతి’ చేయొద్దు అని నీతి వాక్యాలు చెబుతున్నారు. సినిమాల రివ్యూల విషయంలో మరీ చెబుతున్నారు.

అయితే, మరి సినిమా గురించి ప్రచారంలో తాము చేస్తున్నదేంటి అనేది కూడా చూసుకోవాలి. ఏవో కొన్ని సినిమాల గురించే మాట్లాడుతున్నాం అనుకోకపోతే.. రీసెంట్‌గా వచ్చిన రెండు సినిమాలే తీసుకోండి. ఓ హీరో ఏమో ‘రెండు కాలర్లు ఎత్తా’ అని అంటాడు. మరో హీరో కమ్‌ విలనేమో ‘మా హీరోకి ఇది వంద సినిమాలు (పాత హిట్‌)తో సమానం’ అంటారు. మరో హీరో ఏమో ‘టాప్‌లో పోయి కూర్చుంటా’ అంటారు. ఇలా డిజాస్టర్‌గా మిగిలిన సినిమాలు, ఫ్లాప్‌గా మారిన మూవీస్‌కి రిలీజ్‌కి ముందు ఓవర్‌ ఎలివేషన్‌ కచ్చితంగా ఉండే ఉంటుంది. కావాలంటే ఆ సినిమాల రిలీజ్‌ ముందు ప్రచారాలు చూడండి.

ఇకనైనా ఈ ‘అతి’ ప్రచారం తగ్గించుకోకపోతే.. సినిమా విడుదలయ్యాక ఆ హైప్‌కి తగ్గ సినిమా లేదని ప్రేక్షకులు థియేటర్ల నుండి నిరాశగా బయటకు వస్తారు. నిరాశ ముఖాలు కనిపించాక.. ఎంత భారీ వసూళ్ల పోస్టర్లు వేసినా ఉపయోగం ఉండదు.

 హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags