దాదాపు 2 నెలల నుండీ జనాలు అంతా ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. వారికి టీవీ చూడటమే పెద్ద టైం పాస్. ఎక్కువ సేపు ఎవ్వరూ న్యూస్ చానెల్స్ చూడలేరు. ఒకవేళ రోజులో మొదటిసారి టీవీ పెట్టినప్పుడు ఓ గంట సేపు చూస్తారేమో కానీ.. ఆ తరువాత వెంటనే ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ పెట్టేందుకు రిమోట్ తో రెడీగా ఉంటారు. ఇక సీరియల్స్ కూడా.. కొత్త ఎపిసోడ్స్ రావడం లేదు.. మొదటి ఎపిసోడ్ నుండీ టెలికాస్ట్ చేస్తున్నారు.
కొన్ని ఛానల్స్ లో అయితే రాత్రిపూట పూర్తిగా సీరియల్స్ ను నిలిపివేసి.. సినిమాలు టెలికాస్ట్ చేస్తున్నారు. సోమవారం నుండీ గురువారం వరకూ పాత సినిమాలు టెలికాస్ట్ చేస్తుండగా శుక్ర,శని, ఆదివారాల్లో కొత్త సినిమాలు టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా హ్యాపీగా వాటిని వీక్షిస్తున్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా టి.ఆర్.పి నమోదవుతున్నాయి. కొత్త సినిమా.. పాత సినిమా అనే తేడా లేదు. డబ్బింగ్ సినిమా కదా సెపరేషన్ కూడా లేదు.
అన్ని సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ’90 ఎం.ఎల్ చిత్రం గతవారం టెలికాస్ట్ అయిన సినిమాల టి.ఆర్.పి రేటింగ్ ల లిస్ట్ లో టాప్ ప్లేస్ కొట్టేసింది. ఈ సినిమా థియేట్రికల్ పరంగా ఆడకపోయినా… బుల్లితెర పై మాత్రం అదరకొట్టింది. ఇక ‘సరైనోడు’ ‘లోకల్ బాయ్’ ‘వినయ విధేయ రామ’ సినిమాలు కూడా మంచి టి.ఆర్. పి లనే నమోదు చేసాయి. ఒకసారి టాప్ 10 లిస్ట్ ను చూద్దాం రండి :
1)90 ఎం.ఎల్ : 10.92 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
2) సరైనోడు : 7.64 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
3)లోకల్ బాయ్ : 7.19 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
4) వినయ విధేయ రామ : 6.35 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
5) సంక్రాంతి : 6.32 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
6) డుంబో : 5.75 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
7) కాంచన 3 : 5.59 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
8) ఎంతమంచి వాడవురా : 5.45 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
9) గీత గోవిందం : 5.24 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
10) దర్బార్ : 5.04 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!