Jaffa: ‘జఫ్ఫా’ అనే పదం ఆ సినిమా నుంచే వైరల్

బ్రహ్మానందం చెప్పే ఊత పదాల్లో జఫ్ఫా ఒకటి. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా ఎక్కువసార్లు ఇదే పదం రిపీట్ చేస్తారు. జఫ్ఫా టైటిల్ తో సినిమానే వచ్చింది. వెన్నెల కిషోర్ ఆ సినిమాను డైరెక్ట్ చేశాడు. అంతగా క్రేజ్ అందుకున్న జఫ్ఫా సోషల్ మీడియాలో మీమ్స్ కు కూడా ప్రత్యేకమైన ఆయుధం. ఒక విదంగా ఆ పదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సరదగా స్నేహితులతో మాట్లాడుకునే సందర్భాల్లో కూడా జఫ్ఫా అనే పదాన్ని వాడేస్తూ ఉంటారు.

అసలు ఈ పదం ఎలా మొదలైంది అనే విషయంలోకి వెళితే ఇటీవల దాన్ని మొదటి సారి వాడిన డైలాగ్ రైటర్ నివాస్ వివరణ ఇచ్చారు. నిజానికి జఫ్ఫా అనేది ఇజ్రాయెల్ లోని ఒక పురాతన ఓడరేవు పేరు. అయితే ఈ రైటర్ కు ఆ పదం ఎప్పుడు మైండ్ లోకి వచ్చిందో తెలియదు గాని మొదటిసారి వాడింది మాత్రం ‘పార్టీ’ సినిమాలో అని చెప్పాడు. అల్లరి నరేష్ , శశాంక్ నటించిన పార్టీ సినిమా 2006లో వచ్చింది.

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు నివాస్ డైలాగ్స్ అందించారు. ఇక అందులో బ్రహ్మానందం వేసే పంచ్ డైలాగ్స్ లలో జఫ్ఫా అనే పదం వాడారు. మొదట బ్రహ్మానందం ఆ పదంపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఆ సినిమా తరువాత కూడా తన ఇష్ట ప్రకారం అనేక సినిమాల్లో వాడుతూ వచ్చారు. ఆ విధంగా ఆయనకు ట్రెడ్ మార్క్ వర్డ్ గా సెట్టవ్వడంతో ఏకంగా అదే టైటిల్ తో సినిమా వచ్చేలా క్రేజ్ తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో కూడా జఫ్ఫా పదానికి మంచి క్రేజ్ ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus