వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ హీరోయిన్..!

బిగ్ బాస్ సీజన్ 4 మొదలై రెండువారాలు పూర్తి కావస్తుంది. గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సారి షో ఏమంత రంజుగా లేదని చెప్పాలి. చెప్పుకోదగ్గ సెలెబ్రిటీలు లేకపోవడమే ఇందుకు కారణం. దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు షోపై ఆసక్తి పెంచడం కోసం వైల్డ్ కార్డు ఎంట్రీలతో ఒక్కొక్కరిని ప్రవేశ పెడుతున్నారు. గత ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కమెడియన్ ఈరోజుల్లో ఫేమ్ కుమార్ సాయి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు.

నికి తోడు హౌస్ లో గ్లామర్ డోస్ కూడా పెంచాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. దీనికోసం వారు మరో వైల్డ్ కార్డు ఎంట్రీ సిద్ధం చేసినట్లు సమాచారం. యంగ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. ఈరోజు శనివారం కావడంతో హోస్ట్ కింగ్ నాగార్జున బరిలోకి దిగనున్నారు. ఇదే సమయంలో హౌస్ లోకి స్వాతి దీక్షిత్ ని సాదరంగా పంపించనున్నారని వినికిడి. బెంగాలీ అమ్మాయి అయిన స్వాతి దీక్షిత్, తెలుగులో బ్రేకప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

అల్లరి నరేష్ హీరోగా నటించిన జంప్ జిలాని మూవీలో ఒక హీరోయిన్ గా చేసింది. మరో రెండు తెలుగు సినిమాలలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా నటించారు . ఇప్పటికే హౌస్ లో ఉన్న అందమైన అమ్మాయిలు, అబ్బాయిల మధ్య రొమాన్స్ మొదలైపోయింది . స్వాతి దీక్షిత్ ఎంట్రీతో ప్రేక్షకులకు మరింత గ్లామర్ మరియు రొమాంటిక్ ఎపిసోడ్స్ దక్కే అవకాశం కలదు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus