ఓ స్టార్ హీరో పిలిచి మనం సినిమా చేద్దాం ఓ మంచి కథ చెప్పు అని ఎవరైనా దర్శకుడికో, రచయితకో అంటే ఎగిరి గంతేసి.. వెంటనే ఓ లైన్ చెబుతారు. లేదంటే ఒకట్రెండు రోజుల్లో వచ్చి కథ చెబుతా అని టైమ్ తీసుకుంటారు. యువ దర్శకుడు అయినా, సీనియర్ దర్శకుడు అయినా రియాక్షన్ దాదాపు ఇలానే ఉంటుంది. రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాతో మంచి విజయం అందుకున్న వెంకీ అట్లూరికి (Venky Atluri) ఇలాంటి ఆఫరే వచ్చింది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుండి.
ఇంకేముంది పైన చెప్పినట్లే చేసి ఉంటారు వెంకీ అట్లూరి అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది పూర్తి విరుద్ధం. ‘ఇప్పుడు కాదు సర్.. ఓ సంవత్సరం తర్వాత వస్తాను’ అని చెప్పి వచ్చేశారట వెంకీ అట్లూరి. అయితే ‘మీ స్థాయికి తగ్గ కథ నా దగ్గరలేదు. మీ ఫ్యాన్స్‌ని అలరించే కథ లేదు’ అని రెండు మాటలు కూడా చెప్పారనుకోండి. నిజమా అని అనుకోవద్దు. ఈ విషయం చెప్పింది వెంకీ అట్లూరితో వరుస సినిమాలు చేస్తున్న నిర్మాత నాగవంశీనే (Suryadevara Naga Vamsi) .
‘లక్కీ భాస్కర్’ సినిమా విజయం నేపథ్యంలో ఆ మధ్య చిరంజీవి టీమ్ మొత్తాన్ని ఇంటికి పిలిచి మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో వెంకీతో చిరు మాట్లాడుతూ ‘ఓ మంచి కథ చెప్పు.. సినిమా చేద్దాం’ అన్నారట. అప్పుడే వెంకీ మంచి కథ రాసుకొని ఓ సంవత్సరం తర్వాత మీ దగ్గరకు వస్తాను అని చెప్పారట. మామూలుగా అయితే ఛాన్స్ వదులుకోకూడదు. కానీ చిరంజీవితో సినిమా అంటే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటిది. అందుకేనేమో వెంకీ అట్లూరి అలా అన్నారు అని సమాచారం.
చిరంజీవితో గతంలో కొంతమంది దర్శకులు కథ చెప్పి.. దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే క్రమంలో ఇబ్బందులు వచ్చి ఆగిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సినిమా అనౌన్స్ అయ్యాక ఆగిపోతే బాధే కదా. అందుకేనేమో వెంకీ అట్లూరి ఇలా అన్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను సితార నాగవంశీనే నిర్మిస్తారని భోగట్టా.
#Chiranjeevi – #VenkyAtluri On the Cards!
Chiranjeevi Garu spoke to Venky, but Venky requested at least a year to prepare the script, says Naga Vamsi. pic.twitter.com/8MaaD55LK0
— Movies4u Official (@Movies4u_Officl) January 20, 2025