సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. రీసెంట్ గా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు తెలుగు చిత్ర పరిశ్రమలోని మరో యంగ్ డైరెక్టర్ కూడా కన్నుమూశారు. పైడి రమేష్ అనే దర్శకుడు భవనంపై నుంచి జారిపడి మృతి చెందినట్లు తెలుస్తోంది.
పలు ప్రముఖ దర్శకుల దగ్గర సహాయక దర్శకుడిగా పని చేసిన రమేష్ ఇటీవల దర్శకుడిగా కూడా మారాడు. ఎలాగైనా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతను కన్నుమూయడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న పైడి రమేష్ గురువారం రోజు ఆరేసిన బట్టలు తీయడానికి నాలుగవ అంతస్తులోకి వెళ్ళాడు. ఇక అప్పుడే అనుకోకుండా అతను కరెంట్ తీగల కారణంగా షాక్ కొట్టినట్లు తెలుస్తోంది.
కరెంట్ షాక్ తగలగానే రమేష్ కింద పడి మరణించినట్లు తెలుస్తోంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్శకుడిగా అడుగులు వేస్తున్న పైడి రమేష్ మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా రమేష్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. ఇక పైడి రమేష్ ‘రూల్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా 2018లో విడుదలైంది. కానీ ఆ సినిమాతో అతనికి అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.
ఇక ఆ తరువాత మళ్ళీ మరో సినిమాతో గుర్తింపు అందుకోవాలి అని ప్రయత్నం మొదలు పెట్టాడు. కానీ ఇంతలోనే అతను అనుకోని విధంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక రమేష్ మృతిపట్ల పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కూడా జరుపుతున్నారు. ఇక రమేష్ మృతిపట్ల పలువురు సినీ తారలు సోషల్ మిడియా ద్వారా నివాళులర్పించారు.
యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఈ స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. త్వరలో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!