ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలగడం, ఆ స్థానం నుండి అమాంతం పడిపోవడం చూస్తుంటాం. ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది ఇలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువయ్యాయి. అలాంటి వారిలో వరుణ్ సందేశ్ ఒకరు. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరో, ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. అయితే ఏమైందో ఏమో, ఆ తర్వాత అమాంతం గ్రాఫ్ పడిపోయింది.
స్టార్ హీరో అవుతాడు అన్నవాళ్లే, ఇలా అయిపోయాడేంటి అన్నారు. తాజాగా తన కెరీర్ గురించి వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. అడపా దడపా సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ ప్రస్తుతం బిజీగా ఉంటున్నాడు వరుణ్ సందేశ్. సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తుండగా, టీవీ షోలకు భార్య వితిక షేరుతో హాజరవుతున్నాడు. అలా ఓ టీవీకి షోకి వచ్చాడు. కెరీర్ సంగతి ఏంటి, ఎలా సాగింది, ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలకు వరుణ్ సందేశ్ సమాధానం చెప్పాడు.
నేను చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతోనే తన (Hero) కెరీర్‌కు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. సినిమాలు సెలెక్ట్ చేయడంలో తాను ఎక్కడో పొరపాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు కెరీర్‌లో ఒడుదొడుకుల వల్ల ఒకానొక సమయంలో ఫ్యామిలీతో పాటు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పాడు వరుణ్. అక్కడ ఏవేవో వ్యాపారాలు చేద్దాం అనుకున్నారట. అయితే అవేవీ ఆశించినంతగా లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశామని చెప్పారు వరుణ్.
ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని, ఒకరి సంతోషం ఇంకొకరి సంతోషంగా ఉంటామని.. అందుకే ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డామని వితిక చెప్పింది. కార్లు, బంగ్లాలు కొనేయాలి ఏదో అయిపోవాలి అనే ఆలోచన మాకు లేదని కూడా చెప్పింది. ఒకానొక సమయంలో చేతిలో ఒక రూ.5 వేలు కూడా లేవని చెబుతూ భావోద్వేగానికి గురైంది వితిక. దీంతో వారి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.