టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి హీరో రాజా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన పాస్టర్ గా మారి దేవుని సేవలో నిమగ్నమయ్యారు. ఇలా పాస్టర్ గా కొనసాగుతున్నటువంటి రాజా తాజాగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా దైవ సన్నిధిలో కొనసాగుతూ ఉన్నటువంటి రాజా ఉన్నఫలంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని రాజకీయాలలోకి వచ్చారు.
ఈ క్రమంలోనే ఈయన విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీలోకి చేరిన అనంతరం ఈయన మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా రాజ మాట్లాడుతూ తనకు రాజకీయాలు కొత్త ఏమి కాదు ఇంతకుముందు తెరవెనక ఉండి రాజకీయాలు చేశాను. అయితే ఇప్పుడు తెర ముందుకు వచ్చి రాజకీయాలు చేస్తున్నానని తెలిపారు.
కేవలం ఒక రాష్ట్రం కోసం మాత్రమే కాదు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని ఈ సందర్భంగా రాజా తెలియజేశారు. ఇక ఈయన సినీ కెరియర్ విషయానికి వస్తే ఆనంద్ సినిమా ద్వారా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన ఆ నలుగురు, వెన్నెల వంటి సినిమాలలో నటించారు.
ఇక పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో కూడా రాజా (Raja) నటించారు. అయితే ఉన్నఫలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటూ 2014వ సంవత్సరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అయితే కొంతకాలం తర్వాత పార్టీకి దూరంగా ఉన్నటువంటి రాజా పాస్టర్ గా మారిపోయారు అయితే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!