డేట్స్ సమస్య… టాలీవుడ్‌లో ఈ మాట అందరికీ సుపరిచితమే. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకు పండగల సమయంలో ఇలాంటి మాట వింటూ ఉంటాం. అయితే కుర్ర హీరోలు కూడా ఈ సమస్య పడుతూ ఉంటారు. అలా ఇద్దరు యువ హీరోలు తేదీలతో తకరారు పడుతున్నారు. ఆ సినిమాల మీద నమ్మకం లేదా అంటే.. కొంచెం కష్టంగానే ఉంది అని చెప్పొచ్చు. వాళ్లే కార్తికేయ, బెల్లంకొండ గణేష్. వీరి సినిమాలు చాలా రోజుల నుండి వస్తాయి వస్తాయి అంటున్నారు కానీ రావడం లేదు.
ప్రస్తుత సినిమా (Tollywood) మార్కెట్‌లో చిన్న హీరోలకు రిలీజ్ అనేది ఇబ్బందిగానే ఉంటోంది. అంతా ఓకే అనుకున్నా.. ఇంకెవరో ఓవర్ టేక్ చేసి సినిమా రిలీజ్ చేసుకుంటారు. లేకపోతే అప్పటికే వచ్చిన సినిమా బాగా ఆడుతోందని ఈ సినిమాను పక్కనుండమంటున్నారు. సరైన డేట్ దొరక్క… నానా ఇబ్బందులు పడి ఏదైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే హఠాత్తుగా మార్చుకోవాల్సిన పరిస్థితి చూస్తున్నాం. అలా వెనక్కి వెళ్లి ఇప్పుడు కొత్త డేట్ కోసం చూస్తున్నవాళ్లే వాళ్లు.
‘ఆర్‌ఎక్స్ 100’తో అరంగేట్రంలోనే మాస్ హీరో అనిపించుకున్న కార్తికేయ ఆ తర్వాత విలన్‌గానూ చేసి మెప్పించాడు. ఇప్పుడు ‘బెదురులంక’ అంటూ ఫస్ట్ కాపీ పట్టుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. ప్రచార చిత్రాలు, రియాలిటీ షో విజిట్‌లు కూడా అయిపోయాయి. కానీ సినిమా మాత్రం విడుదల కావడం లేదు. ఇప్పుడు ఏప్రిల్‌లో డేట్‌ను అనుకున్నారు. కానీ ఆ సందడేమీ కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాను మార్చి 21న అనుకున్నారు.
కానీ విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఉండటం వల్ల డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఏప్రిల్ సరైన స్లాట్స్ లేవు అని చెప్పొచ్చు. దీంతో మేలోకి వెళ్లిపోవాలని అనుకుంటున్నారని టాక్. ఇక బెల్లంకొండ గణేష్ రెండో సినిమా (నేను స్టూడెంట్‌ని సర్’కి కూడా ఇదే తరహా సమస్య. మార్చి 10నే ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఆపేశారు. ఇప్పుడు ఏప్రిల్ 21 అనుకుంటున్నారు కానీ మళ్లీ డౌట్ అంటున్నారు. ఆ డేట్‌కి ఉన్న పోటీనే దీనికి కారణం అని టాక్.
పోనీ వచ్చే నెలలో చూద్దాం అంటే 18 ఖాళీగా ఉందనుకున్నారు. కానీ ఆ రోజు శ్రీవిష్ణు, సంతోష్ శోభన్ తమ సినిమాలతో వచ్చేస్తున్నారట. ఇవి కూడా ఎప్పుడో పూర్తయిన సినిమాలే. నిజానికి వీరికి కూడా డేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలా టాలీవుడ్‌లో యంగ్ హీరోలు తేదీలతో తంటాలు పడుతున్నారు అని చెప్పొచ్చు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?