2016 లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న భామలు

తెలుగు సినీ పరిశ్రమలో హీరోలే కాదు.. హీరోయిన్స్ కూడా భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. కొంతమంది క్రేజీ భామలకిచ్చే రెమ్యునరేషన్ తో చిన్న బడ్జెట్ సినిమాలు తీయొచ్చు అంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది అత్యధిక పారితోషికం అందుకున్న టాప్ టెన్ హీరోయిన్స్ వీరే.

అనుష్కటాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. పదేళ్లుగా తెలుగు, తమిళంలో 30 కి పైగా సినిమాలు చేసింది. వీటిలో అనేక చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. మిర్చి వరకు 2 కోట్లు మాత్రమే అందుకున్న స్వీటీ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ధర పెంచేసింది. బాహుబలి బిగినింగ్ సినిమాకు అనుష్క రూ. 4 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుతం నటిస్తున్న బాహుబలి కంక్లూజన్ కి 5 కోట్లు అందుకున్నట్లు సమాచారం.

సమంతసినీ పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిన నటి సమంత. ఈఏడాది వరుసగా 4 హిట్లు అందుకుంది. అందుకే ఆమె చిన్న, పెద్ద, తమిళం, తెలుగు అని తేడా లేకుండా ప్రతి సినిమాకు రూ. 2 కోట్లు తీసుకుంటోంది.

కాజల్ అగర్వాల్టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ ఈ సంవత్సరం నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వీటికి ఒక్కో సినిమాకు కాజల్ రూ. 2 కోట్లు పుచ్చుకున్నారు. ఇవి ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ రెమ్యూనరేషన్లో వెనక్కి తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవితో ఆమె కలిసి నటిస్తున్న ఖైదీ నంబర్ 150 హిట్ సాధిస్తే పారితోషికం పెంచే అవకాశం ఉంది.

తమన్నామిల్కీ బ్యూటీ తమన్నామంచి సినిమాలు చేసినా అపజయాలు వెంటాడాయి. బాహుబలి బిగినింగ్ సినిమా ద్వారా ఆమెకు మళ్లీ హ్యాపీ డేస్ వచ్చాయి. తర్వాత నటించిన ఊపిరి సినిమాకు రూ. కోటి అందుకుంది. ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ కి రూ. 2 కోట్లు అందుకోనుందని సమాచారం.

శృతి హాసన్మొదట్లో హీరోయిన్ గా శృతి హాసన్ చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతుండడంతో ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకుంది. గబ్బర్ సింగ్ తో తొలి విజయాన్ని అందుకున్న ఈ భామ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. శృతి హాసన్ నటించిన శ్రీమంతుడు చిత్రం భారీ హిట్ సాధించింది. ఈ సినిమాకు రూ.కోటి అందుకున్న ఈ నటి ఆ చిత్రం సక్సస్ తో అరకోటి పెంచింది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు కోసం కోటిన్నర తీసుకుంది.

రకుల్ ప్రీతి సింగ్ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది రయ్ మంటూ దూసుకొచ్చేసింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హ్యాట్రిక్ విజయం అందుకోవడంతో రెమ్యునరేషన్ ను పెంచేసింది. మీడియా ముందు కూడా ఈ విషయాన్ని రకుల్ ఒప్పుకుంది. ఆమె పబ్లిక్ గా రెమ్యునరేషన్ గురించి చెప్పకపోయినా నిర్మాతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కోటిన్నర తీసుకుంటోందంట. సక్సస్ ఇచ్చిన కిక్ అంటే అది.

నయన తారప్రేమ, పెళ్లి వివాదాలతో నయన తార మానసికంగా కుంగి పోయినా .. బయటపడి తమిళ్, తెలుగు సినిమాల్లో బిజీ అయింది. “బాబు బంగారం”లో వెంకటేష్ సరసన నటించినందుకు కోటి అందుకుంది. అతి తక్కువ డేట్స్ కి పెద్ద మొత్తాన్ని తీసుకుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళ నిర్మాతలు సినిమాకు రెండు కోట్ల వరకు ఇస్తున్నట్లు తెలిసింది. అందుకే తెలుగు చిత్రాలను ఆమె అంగీకరించడంలేదు.

త్రిషచెన్నై బ్యూటీ త్రిష పెళ్లిచేసుకొని సినిమాలకు గుడ్ బై చెబుతుందని అనుకున్నారు. కానీ కాబోయే భర్తకే బై బై చెప్పి నటిగా కొనసాగింది. ఈ సంవత్సరం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ నాయకి చేసిన ఏ భామ, తమిళంలో కోడి తో హిట్ అందుకుంది. హిట్, ఫట్ లతో సంబంధం లేకుండా సినిమాకు కోటి తీసుకుంటోంది.

నిత్యామీనన్స్కిన్ షో కి దూరంగా ఉంటూ అవకాశాలను అందుకుంటున్న నటి నిత్యామీనన్. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు ఈ ఏడాది ఆరు రిలీజ్ అయ్యాయి. అంతలా డిమాండ్ ఉంది కాబట్టే ఆమె సినిమాకు 90 లక్షలు తీసుకుంటోంది. కొంతమంది నిర్మాతలు కోటి ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే కథ, పాత్ర నచ్చనిదే ఎంత ఇచ్చినా చేయనంటోంది నిత్యామీనన్.

హన్సికపాలబుగ్గల సుందరి హన్సిక యువ హీరోలతో చిత్రాలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఈమె రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు దూరమైనప్పటికీ తమిళంలో అనేక విజయాలను అందుకుంది. ఈ సంవత్సరం మంచు విష్ణు సరసన లక్కున్నోడు చిత్రంలో నటించింది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇందుకు హన్సిక 80 లక్షలు పారితోషికం తీసుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus