Abhay Naveen: ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ అభయ్ నవీన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 8’ ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్ ను కూడా నాగార్జునే (Nagarjuna) హోస్ట్ చేస్తున్నారు. ఈ సీజన్ ‘ఏదైనా అన్ లిమిటెడ్’ అనే థీమ్ తో మొదలైంది. హౌస్ మేట్స్ అందరూ ఆనందంగా హౌస్లోకి వెళ్లారు. అయితే రెండో రోజు నుండి వారు తమ ముసుగులు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా చాలా మంది ఓపెన్ అయ్యారు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే ఈ సీజన్ కి 3వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అభయ్ నవీన్ (Abhay Naveen). బిగ్ బాస్ కి ముందు ఇతన్ని పలు సినిమాల్లో మనం చూశాం. ఇంకా ఇతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

Abhay Naveen

అభయ్ నవీన్ అసలు పేరు బేతిగంటి నవీన్ కుమార్.

1987 నవంబర్ 1 న ఇతను తెలంగాణలోని సిద్దిపేట్లో జన్మించాడు.ఇతని విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది.

అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఇతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు

ఇతని తండ్రి పేరు రాజయ్య, తల్లి వసంత. ఇతనికి చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు నవ్య

అభయ్ నవీన్ కి పెళ్లయింది. అతని భార్య పేరు భవాని

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘పెళ్ళిచూపులు’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ‘పెళ్ళి చూపులు’ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.

డైరెక్టర్ గా కూడా మారి ‘రామన్న యూత్’ అనే సినిమా తీశాడు. అది ఆడలేదు.

తర్వాత ‘రాక్షస కావ్యం’ లో విలక్షమైన పాత్ర చేశాడు. అది కూడా ఇతనికి పేరు తెచ్చిపెట్టలేదు.

మరి ‘బిగ్ బాస్ 8’ అయినా ఇతనికి పాపులారిటీ తెస్తుందేమో చూడాలి

‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ ప్రేరణ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు.!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus