ధనుష్ తర్వాతే హిందీ, తెలుగు స్టార్లు.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ స్థానాలు ఏవంటే..?

  • December 8, 2022 / 01:54 PM IST

తెలుగు సినిమాకీ, తెలుగు హీరోలకీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో టాలీవుడ్‌ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి.. ట్రిపులార్ జపాన్‌లో విడుదల చేస్తే ఎలాంటి స్పందన వచ్చిందో చూశాం.. ఇప్పుడు ‘పుష్ప’ రష్యాలో రిలీజ్ కానుంది.. టీం అంతా కొద్దిరోజులుగా అక్కడ సందడి చేస్తున్నారు. ఈమధ్య ఇండియన్ సినిమాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. టాప్ స్టార్స్ సైతం ఓటీటీల్లో సందడి చేస్తూ మెప్పిస్తున్నారు..

కంటెంట్ ఉంటే ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు.. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు విపరీతంగా క్రేజ్ ఏర్పడింది.. ప్రేక్షకులు సౌత్‌, నార్త్‌ సినిమా అనే తేడా లేకుండా ఇండియన్‌ సినిమాలన్నింటినీ చూస్తున్నారు. దీంతో నార్త్‌ ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోయింది. ఈ మాట నిజమనడానికి తాజాగా ఐఎమ్‌డీబీ విడుదల చేసిన టాప్ 10 లిస్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు.. IMDB 2022 సంవత్సరానికి గానూ అత్యంత జనాదరణ కలిగిన భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేసింది.

ఈ లిస్ట్‌లో తమిళ్ హీరో ధనుష్‌ హిందీ, తెలుగు స్టార్లను వెనక్కు నెట్టేసి.. టాప్‌ 1లో నిలిచాడు. తర్వాతి స్థానంలో ఆలియా భట్‌ నిలువగా.. మూడవ స్థానంలో ఐశ్వర్య రాయ్‌ ఉన్నారు. నాలుగవ స్థానంలో తెలుగు స్టార్‌ రామ్‌ చరణ్‌ నిలిచారు. మిగిలిన స్థానాల్లో వరుసగా.. సమంత (5), హృతిక్‌ రోషన్‌ (6), కియారా అద్వానీ (7), జూనియర్ ఎన్టీఆర్ (8) , అల్లు అర్జున్‌ (9), యష్ (10) నిలిచారు. టాప్‌ 10లో ఆరుగురు సౌత్‌ ఇండియన్ స్టార్లకు చోటు దక్కడం విశేషం. అందులోనూ టాప్‌ 1లోనూ ఓ సౌత్‌ స్టార్‌ ఉండడం నిజంగా గ్రేట్..

ఐఎమ్‌డీబీ టాప్ రేటెడ్‌ ఇండియన్‌ సినిమాల లిస్ట్‌లోనూ సౌత్‌ సినిమాలు సత్తా చాటాయి. అత్యంత ఎక్కువ రేటింగ్‌ పొంది ‘777 చార్లీ’ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు 10కి గానూ 9 రేటింగ్‌ వచ్చింది. తర్వాతి స్థానంలో ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్‌’ నిలిచింది. ఈ సినిమాకు 8.9 రేటింగ్‌ వచ్చింది. తర్వాతి స్థానాల్లో కేజీయఫ్‌: ఛాప్టర్‌ 2 (8.4), విక్రమ్‌ ( 8.4), పొన్నియిన్‌ సెల్వన్‌ (8.3), కశ్మీరీ ఫైల్స్ (8.3) మేజర్‌ ( 8.2), డాక్టర్‌ జీ ( 8), ఆర్‌ఆర్‌ఆర్‌ (8), ఎ థర్స్‌డే ( 7.7) చిత్రాలు నిలిచాయి.

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus