24 గంటల్లో ఎక్కువ వ్యూస్ నమోదు చేసిన 10 తెలుగు లిరికల్ సాంగ్స్ లిస్ట్

పాటలు హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే అని అంతా అంటుంటారు. అది పూర్తిగా కాకపోయినా కొంత వరకు నిజమే. సినిమా ప్రమోషన్లో భాగంగా యూట్యూబ్లో విడుదల చేసే లిరికల్ సాంగ్స్ చాలా కీలకమైనవి. ఒకప్పుడు క్యాసెట్లు ఉండేవి. అవి ఎక్కువ సేల్ అయితే ఆడియో హిట్ అని అంతా భావించేవారు. తర్వాత సీడీల కాలం వచ్చింది. అప్పుడు ఎక్కువ సేల్ అయితే ఆడియో హిట్ అనే వారు. ఇంకాస్త టెక్నాలజీ పెరిగాక ఎక్కువ డౌన్లోడ్స్ జరిగితే ఆడియో హిట్ అనేవారు.

ఇప్పుడు పరిస్థితి ఇంకా మారింది.ఓ లిరికల్ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన 24 గంటల్లో దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైకులు పడ్డాయి.. అనే కొలమానం ప్రకారమే.. ఆ సాంగ్ హిట్టా కాదా? అనేది డిసైడ్ చేస్తున్నారు. కొత్త సినిమాలకి ఇది చాలా ముఖ్యం. పలనా సాంగ్ కి వచ్చిన రీచ్ ను బట్టి.. సోషల్ మీడియాలో మరింతగా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Top 10 Most Viewed Lyrical Songs

తాజాగా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) నుండి ‘కిస్సిక్’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ కి శ్రీలీల  (Sreeleela.. బన్నీతో (Allu Arjun)  కలిసి డాన్స్ చేసింది అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి.. అందరి దృష్టి ఈ సాంగ్ పై పడింది. అందుకే ‘కిస్సిక్’ లిరికల్ సాంగ్ (Lyrical Songs) యూట్యూబ్లో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. ఒకసారి టాప్ 10 లిరికల్ సాంగ్స్ ని  గమనిస్తే :

1) కిస్సిక్ :

అల్లు అర్జున్ – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో ‘పుష్ప’ కి సెకండ్ పార్ట్ గా తెరకెక్కిన ‘పుష్ప 2’ లోని పాట ఇది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)   సంగీతం అందించిన ఈ చిత్రంలోని 3వ పాటగా ‘కిస్సిక్’ రిలీజ్ అయ్యింది. విడుదలైన 24 గంటల్లో ఈ పాట 27.19 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది.

2) ధం మసాలా :

మహేష్(Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram)  కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  చిత్రానికి తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ లో భాగంగా మొదటి లిరికల్ సాంగ్ గా విడుదలైన ‘ధం మసాలా’ విడుదలైన 24 గంటల్లో 17.42 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి నెంబర్ ప్లేస్ ను దక్కించుకుంది.

3) రా మచ్చ మచ్చ :

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్  (Shankar)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’  (Game Changer)  సినిమాకి కూడా తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నుండి రెండో పాటగా విడుదలైన ‘రా మచ్చ మచ్చ’ అనే పాట విడుదలైన 24 గంటల్లో 16.44 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి టాప్ 3 ప్లేస్ లో కొనసాగుతుంది.

4) పెన్నీ :

మహేష్ – పరశురామ్ (Parasuram) కాంబినేషన్లో వచ్చిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాకి కూడా తమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ గా విడుదలైన ‘పెన్నీ’ 24 గంటల్లో 16.38 వ్యూస్ ని నమోదు చేసి టాప్ 4 ప్లేస్ ను దక్కించుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

5) చుట్టమల్లె :

ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ  (Koratala Siva)  కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘దేవర’ (Devara) లోని సాంగ్ ఇది. అనిరుధ్ (Anirudh Ravichander) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం నుండి రెండో పాటగా విడుదలైన ‘చుట్టమల్లె’ సాంగ్ 24 గంటల్లో 15.68 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది. ఆ రకంగా ఇది టాప్ 5 లో నిలిచింది.

6) కళావతి :

మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా ఈ ‘కళావతి’ పాట రిలీజ్ అయ్యింది. దీనికి తమన్ సంగీత దర్శకుడు. ఇక ఈ పాట విడుదలైన 24 గంటల్లో 14.78 వ్యూస్ ని నమోదు చేసి నెంబర్ 6 ప్లేస్ లో కొనసాగుతుంది.

7) మ మ మహేష :

మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి 4వ లిరికల్ సాంగ్ గా ఈ ‘మ మ మహేశా’ పాట రిలీజ్ అయ్యింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 13.56 వ్యూస్ ని నమోదు చేసి నెంబర్ 7వ ప్లేస్లో కొనసాగుతుంది.

8) ఉ అంటావా ఉఊ అంటావా :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ సినిమా నుండి 5వ లిరికల్ సాంగ్ గా ఈ ‘ఉ అంటావా ఉఊ అంటావా’ సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సమంత ఈ సాంగ్లో అల్లు అర్జున్ పక్కన డాన్స్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ దీనికి సంగీత దర్శకుడు. ఇక ఈ పాట విడుదలైన 24 గంటల్లో 12.39 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది. టాప్ 8 ప్లేస్లో కొనసాగుతుంది.

9) సూసేకి :

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ సినిమాలోని రెండో పాటగా ‘సుసేకి’ రిలీజ్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ దీనికి సంగీత దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఇక ఈ పాట విడుదలైన 24 గంటల్లో 10.97 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది. టాప్ 9 ప్లేస్లో కొనసాగుతుంది.

10) పుష్ప పుష్ప పుష్ప :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప 2’ లోని మొదటి పాటగా ‘పుష్ప పుష్ప పుష్ప’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఇక ఈ పాట విడుదలైన 24 గంటల్లో 10.38 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.ప్రస్తుతానికి టాప్ 10 ప్లేస్లో కొనసాగుతుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus