అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు..!

అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ రోజు రోజుకీ పంజుకుంటుంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా … థియేటర్లు మూతపడ్డాయి. ఈ టైములో ఎంటర్టైన్మెంట్ కు ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ ఫామ్సే కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయాయి. లాక్ డౌన్ లేకపోయినా అమెజాన్ ప్రైమ్ కు మంచి డిమాండ్ ఉంది. సినిమాకి ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా … అమెజాన్ ప్రైమ్ లో చూసుకుందాంలే అని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. చిన్న సినిమాల నిర్మాతలకు అయితే అమెజాన్ ప్రైమ్ పెద్ద కల్పవృక్షంలా మారిపోయింది.

ఇప్పుడు సమ్మర్ కాబట్టి… అందులోనూ లాక్ డౌన్ కారణంగా … జనాలు అమెజాన్ ను విడిచి పెట్టడం లేదు. అందులోనూ సంవత్సరానికి మొత్తం పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. ఒక్కో ఎకౌంటు ను ఎక్కువ మంది వాడుకునే ఫెసిలిటీ ఉండడంతో .. కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తున్నవారు ఎక్కువే. ఇదిలా ఉంటే… ఎక్కువ మంది వీక్షించిన కొన్ని సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఓ పక్క టీవీల్లో టెలికాస్ట్ చేస్తున్నప్పటికీ..యాడ్స్ లేకుండా చూడాలి అని ప్రైమ్ లోనే సినిమాలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

ఇక ఎక్కువ మంది చూస్తున్నవి చిన్న సినిమాలు కావడం విశేషం. మహేష్ బాబు, రాంచరణ్ వంటి పెద్ద హీరోల సినిమాలతో పాటు… ‘రాజా వారు రాణి వారు’ ‘మధ’ ‘పలాస’ వంటి చిత్రాలు కూడా దుమ్ము దులుపుతున్నాయి. ఇప్పటికీ టాప్ లిస్టు లో కె.జి.ఎఫ్ ఉండడం మరొక విశేషం. ఇక ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించిన.. టాప్ 10 తెలుగు సినిమాల లిస్టు ను ఓ లుక్కేద్దాం రండి :

1) కె.జి.ఎఫ్ చాప్టర్ 1

2)రాజావారు రాణివారు

3) మహర్షి

4)ఎవరు

5)బ్రోచేవారెవరురా

6) సరిలేరు నీకెవ్వరు

7) సాహో

8)2.ఓ

9) రంగస్థలం

10) మజిలీ

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus