ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాకేశ్ మాస్టర్ నిన్న అంటే జూన్ 18 న ఆదివారం నాడు మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త టాలీవుడ్ ను కుదిపేసిందనే చెప్పాలి. గత కొంతలంగా ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వచ్చారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ… సెలబ్రిటీల పై షాకింగ్ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచేవారు రాకేశ్ మాస్టర్. ఆయన తిట్టే బూతులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి. సోషల్ మీడియా బ్యాచ్ కి ట్రోలింగ్ స్టఫ్ గా పనికొచ్చేవి.ఇప్పటి జనరేషన్ కి రాకేష్ మాస్టర్ అలా మాత్రమే తెలుసు.
కానీ రాకేష్ మాస్టర్ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పనిచేసేవారు. ఆయన కెరీర్లో దాదాపు 1500 సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పనిచేసేవారు అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. అలనాటి స్టార్ హీరోల సినిమాల నుండీ ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోల వరకు ఎంతోమంది హీరోల సినిమాలకు రాకేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోల సినిమాలకి కూడా ఈయన కొరియోగ్రాఫర్ గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన కొరియోగ్రఫీలో రూపొందిన టాప్ 10 సాంగ్స్ ఏంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) మనసిచ్చాను :
2000 వ సంవత్సరంలో రవితేజ హీరోగా, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ జూనియర్ ఆర్టిస్ట్ గా పిలవబడే మణిచందన హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రమోద్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఇందులో వెండితెరకు మా వందనాలు అనే పాటకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.
2. యువరాజు :
మహేష్ బాబు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ‘చందమామ కన్న చల్లని వాడే’ అనే పాట రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందింది.
3. బడ్బెట్ పద్మనాభం
జగపతి బాబు హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ‘సొమ్ము ఆదా చేయారా’ అనే పాట రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందింది.
4. సీతారామరాజు
నాగార్జున హీరోగా హరికృష్ణ కీలక పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి వై.వి.ఎస్ చౌదరి దర్శకుడు. ఈ సినిమాలో ‘ఎక్స్టసీ ప్రైవసీ’ అనే పాట రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందింది.
5. గర్ల్ ఫ్రెండ్ :
రోహిత్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ‘నువ్వు యాడికొస్తే ఆడికొస్త సువర్ణ’ అనే పాట రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందింది.
6.చిరునవ్వుతో :
వేణు హీరోగా జి.రాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ‘నిన్నలా మొన్నలా లేదురా’ అనే పాట రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందింది.
7. లాహిరి లాహిరి లాహిరిలో :
హరికృష్ణ, ఆదిత్య ఓం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి వై.వి.ఎస్ చౌదరి దర్శకుడు. ఇందులో ‘నేస్తామా ఓ ప్రియ నేస్తమా’ అనే పాట రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందింది.
8. దేవదాసు
రామ్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని ‘నువ్వంటేనే ఇష్టం’ ‘బంగారం.. బంగారం’ ‘నిజంగా చెప్పాలంటే క్షమించు’, ‘ఏయ్ బాబూ ఏంటి సంగతి’ వంటి పాటలు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందాయి.
9 . అప్పారావు డ్రైవింగ్ స్కూల్ :
రాజేంద్రప్రసాద్ హీరోగా అంజి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని అన్ని పాటలకి రాకేష్ మాష్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఇందులో టైటిల్ సాంగ్ మంచి హిట్ అయ్యింది.
10 . వరం
శివాజీ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలోని అన్ని పాటలకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.
ఇవి మాత్రమే కాకుండా చాలా మంది కొత్త హీరోల సినిమాలకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.