ఓ సినిమాకి జరిగే బిజినెస్ విషయంలో శాటిలైట్ రైట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటి ధర కూడా కోట్లల్లో ఉంటుంది. కాబట్టి.. ఓ సినిమా సంపూర్ణ విజయం సాధించింది అని చెప్పడానికి బుల్లితెర పై కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేయాల్సిందే. అయితే బిగ్ స్క్రీన్ పై హిట్ అయిన సినిమాలు స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతాయని కచ్చితంగా చెప్పలేము. ఆ సినిమాని టెలికాస్ట్ చేసే సమయాన్ని బట్టి.. రేటింగ్ అనేది నమోదవుతూ ఉంటుంది. గతంలో అయితే ఛానెల్ వారే.. వారు టెలికాస్ట్ చేసిన సినిమాకి ఇంత టి.ఆర్.పి అంత టి.ఆర్.పి వచ్చింది అంటూ అనౌన్స్ చేసేవారు. అందులో ఎంత నిజం ఉంది అనే విషయాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోయేవారు.
అయితే 2016 నుండీ BARC – బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా సంస్థ రంగంలోకి దిగింది. ఇండియా వైడ్ గా అన్ని టీవీ షోలు, సినిమాలు, న్యూస్ వంటి టి.ఆర్.పి వివరాలను ఈ సంస్థ పర్ఫెక్ట్ గా తెలియజేస్తుంది.మరి బార్క్ వచ్చిన తర్వాత బుల్లితెర పై రికార్డు టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసిన టాప్ 10 సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) అల వైకుంఠపురములో :
త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 29.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
2) సరిలేరు నీకెవ్వరు :
మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 23.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది టాప్ ప్లేస్ లో నిలిచింది.
3) బాహుబలి2 :
ఇండియా వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 22.7 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
4) శ్రీమంతుడు :
మహేష్ బాబు- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 22.54 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
5) దువ్వాడ జగన్నాథం(డిజె) :
అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 21.7 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
6) బాహుబలి 1 :
రాజమౌళి- ప్రభాస్-రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 21.54 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
7) ఫిదా :
వరుణ్ తేజ్- సాయి పల్లవి- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 21.31 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
8) గీత గోవిందం :
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 20.8 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
9) జనతా గ్యారేజ్ :
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 20.69 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
10) మహానటి :
దివంగత గొప్ప నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు 20.21 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.