ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో హీరోయిన్లు ఎంట్రీ ఇస్తారు. అయితే ఇందులో ఎవరు నిలబడతారో.. ఎవరు దుకాణం సర్దేస్తారు అన్నది వారు నటించే సినిమాలను బట్టి కూడా అంచనా వేయలేం. హీరోయిన్లకు సాధారణంగానే లైఫ్ టైం తక్కువ ఉంటుంది. వాళ్ళ నుండి ఎక్కువ కాల్ షీట్లు కూడా ఆశించరు దర్శక నిర్మాతలు. పాటలకు, రొమాంటిక్ సన్నివేశాలకు వీళ్ళు కాల్ షీట్లు ఇస్తే సరిపోతుంది కాబట్టి… వీళ్ళ పారితోషికాలు తక్కువగానే ఉంటాయి. ఎప్పుడైతే కథకు ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తారో అప్పుడే వీళ్లకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది.
హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు కూడా వీళ్ళు సరిపోతారు అని దర్శకనిర్మాతలకు అవగాహన వస్తుంది. ఇలా చేశారు కాబట్టే కొంతమంది హీరోయిన్లు.. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు దాటినా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. 2022 లో పారితోషికాల రూపంలో ఎక్కువగా సంపాదించుకున్న హీరోయిన్లు ఎవరు. ఇప్పటికీ ఎవరి ప్లేస్ ఎలా ఉంది. అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
1) నయనతార :
లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను నయన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. పెళ్ళైనా కూడా ఆమె డిమాండ్ ఏమీ తగ్గలేదు. కాతు వాకుల రెండు కాదల్, గాడ్ ఫాదర్ అలాగే ఇంకో 4 సినిమాలకు కలుపుకుని ఈమె 6 ప్రాజెక్టులకు సైన్ చేసింది. ఈమె రూ.15 కోట్ల భారీ పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
2) రష్మిక :
ఈ ఏడాది 5 సినిమాలకు సైన్ చేసిందని వినికిడి. కాబట్టి ఈమె కూడా రూ.10 కోట్ల నుండి రూ.12 కోట్ల వరకు పారితోషికం అందుకుందని వినికిడి.
3) పూజా హెగ్డే :
మన బుట్టబొమ్మ కూడా 5 సినిమాలకు సైన్ చేసింది. ఈమె కూడా రూ.12 కోట్ల వరకు పారితోషికం అందుకుందని వినికిడి.
4) కీర్తి సురేష్ :
ఈమె 4 సినిమాలకు సైన్ చేసింది. రూ.8 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకుంది అని వినికిడి.
5) కృతి శెట్టి :
ఈమె కూడా 4 సినిమాలకు సైన్ చేసింది. రూ.7 కోట్ల వరకు పారితోషికం అందుకుంది అని వినికిడి.
6)సమంత :
ఈ ఏడాది 2 సినిమాలు మాత్రమే చేసింది. అయినప్పటికీ ఈమె పారితోషికం కూడా రూ.6 కోట్ల వరకు అందుకున్నట్టు సమాచారం.
7) నిత్యా మేనన్ :
భీమ్లా నాయక్, తిరు వంటి పెద్ద సినిమాలు చేసింది. ఈమె పారితోషికం రూ.4 కోట్ల వరకు ఉండొచ్చు అని సమాచారం.
8) రాశీ ఖన్నా :
ఈ భామ 4 సినిమాల్లో నటించింది. రూ.4 కోట్ల వరకు ఈమె పారితోషికం అందుకుందని సమాచారం.
9) తమన్నా :
3 సినిమాల్లో నటించింది. ఈమె పారితోషికం రూ.3 కోట్ల వరకు అందుకున్నట్టు తెలుస్తుంది.
10) ఐశ్వర్య లక్ష్మీ :
ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఈ భామ 6 సినిమాల్లో నటించింది. రూ.3.5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
11) సాయి పల్లవి :
ఈ ఏడాది 6 సినిమాల్లో నటించింది. రూ.3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
12) అనుపమ పరమేశ్వరన్ :
4 సినిమాల్లో నటించింది. రూ.2 కోట్ల వరకు పారితోషికం రూపంలో సంపాదించుకున్నట్టు తెలుస్తుంది.
13) ప్రియాంక అరుళ్ మోహన్ :
ఈ భామ 4 సినిమాల్లో నటించింది. రూ.2 కోట్ల వరకు పారితోషికం రూపంలో సంపాదించుకున్నట్టు సమాచారం.
14)శృతి హాసన్ :
3 బడా సినిమాల్లో నటిస్తోంది.రూ.3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
15)త్రిష :
2 సినిమాలకు సైన్ చేసింది. రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది.