దక్షిణాదిన అత్యధిక కలక్షన్స్ సాధించిన చిత్రాలు

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ.. భాష ఏదైనా భావం ఒకటే అయిపోయింది. సినిమా దక్షిణాది ప్రజలందరినీ ఒకటి చేసింది. తెలుగు సినిమా తమిళంలో కోట్లు రాబడుతోంది. తమిళ సినిమా కన్నడలో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. అందుకే గత కొంతకాలంగా దక్షిణాది సినిమాలు ఏ భాషలో రూపొందినా అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబడుతున్నాయి. అలా ఇప్పటి వరకు అత్యధిక కలక్షన్స్ సాధించిన దక్షిణాది టాప్ 20 సినిమాలపై ఫోకస్..

1. బాహుబలి 2 : 1706.5 కోట్లు (తెలుగు, తమిళం, హిందీ, మలయాళం)

2. బాహుబలి : 600 కోట్లు (తెలుగు, తమిళం , హిందీ)

3. రోబో : 289 కోట్లు (తమిళం, తెలుగు , హిందీ)

4. కబాలి : 286.75 కోట్లు (తమిళం, తెలుగు , హిందీ)

5. మెర్సల్ : 244.8 కోట్లు (తమిళం, తెలుగు)

6. ఐ : 239 కోట్లు (తమిళం, తెలుగు , హిందీ)

7. రంగస్థలం : 200 కోట్లు (తెలుగు భాషలో మాత్రమే)

8. ఖైదీ నంబర్.150 : 164 కోట్లు (రీమేక్ మూవీ)

9. శివాజీ : 155 కోట్లు (తమిళం, తెలుగు , హిందీ)

10. లింగా :154 కోట్లు (తమిళం, తెలుగు , హిందీ)

11. భరత్ అనే నేను : 150 కోట్లు ( తెలుగు, తమిళం)

12. మగధీర : 150 కోట్లు ( తెలుగు, తమిళం, మలయాళం)

13. శ్రీమంతుడు : 144.55 కోట్లు ( తెలుగు, తమిళం)

14. తేరి : 143.6 కోట్లు ( తెలుగు, తమిళం)

15. పులి మురుగన్ : 140 కోట్లు ( మలయాళం, తెలుగు)

16. జనతా గ్యారేజ్ :134.8 కోట్లు (తెలుగు, మలయాళం)

17. అత్తారింటికి దారేది : 131 కోట్లు (తెలుగులో మాత్రమే)

18. జై లవ కుశ : 130.9 కోట్లు (తెలుగులో మాత్రమే)

19. సరైనోడు : 127.6 కోట్లు (తెలుగు, మలయాళం)

20. వేదాలం : 126 కోట్లు ( తమిళంలో మాత్రమే)

ఈ టాప్ 20 జాబితాలో 11 తెలుగు సినిమాలు ఉండడం, అది కూడా మొదటి, రెండు స్థానాలను కైవశం చేసుకోవడం తెలుగు సినీ అభిమానులు సంతోషించదగ్గ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus