పూజ హెగ్డేతో పాటు స్టార్ హీరోలకి సిస్టర్స్ గా నటిస్తున్న స్టార్ హీరోయిన్లు..!

స్టార్ హీరోయిన్లు అన్నాక హీరోల పక్కనే ఉండాలి.. హీరోలకి జోడీలుగా మాత్రమే చేయాలి అన్నది పాత పద్ధతి అనుకోనవసరం లేదు. ఎందుకంటే ‘రక్తసంబంధం’ చిత్రంలో ఎన్టీఆర్- సావిత్రి అన్నా చెల్లెల్లుగా నటించారు. ఆ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చెల్లెలి పాత్రని పోషించడం.. అదీ స్టార్ హీరోకి చెల్లెలుగా నటించడం ఆమె రిస్క్ అనుకోలేదు, చాలా సినిమాల్లో వీళ్ళు జోడీగా నటించినా ఈ సినిమాలో సావిత్రి చెల్లెలుగా నటించింది.

ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా వల్ల సావిత్రి స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. చాలా కాలం తర్వాత ఆమె బాటలోనే కొంతమంది స్టార్ హీరోయిన్లు అడుగులు వేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) నయనతార : మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సిస్టర్ రోల్ పోషిస్తుంది స్టార్ హీరోయిన్ నయనతార. ఈ సినిమాలో చెల్లెలు అన్నట్టుగా ఉంటుంది కానీ వీళ్ళ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఏమీ ఉండవు.అయినప్పటికీ స్టార్ హీరోయిన్ అయిన నయన తార.. ‘సైరా’ లో చిరుకి భార్యగా నటించి, ‘గాడ్ ఫాదర్’ లో ఆయనకి చెల్లెలుగా కనిపించడం విశేషంగానే చెప్పుకోవాలి.

2) కీర్తి సురేష్ : ఓ పక్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరో పక్క… ‘పెద్దన్న’ చిత్రంలో రజనీకాంత్ కు చెల్లెలి పాత్రలో నటించింది కీర్తి సురేష్. ఇప్పుడు మరోసారి చిరు హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీలో కూడా ఆమె చిరుకి చెల్లెలి పాత్రని పోషిస్తుంది. ఇందులో కూడా చిరుకి ఆమె సొంత చెల్లెలిగా కాదు.. కానీ సొంత చెల్లెలిగా చిరు పాత్ర చూసుకుంటుంది. ఒరిజినల్ చూసిన వాళ్లకి ఈ విషయం బాగా తెలుసు.

3) పూజా హెగ్డే : పూజ హెగ్డే… హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో వెంకటేష్ కు చెల్లెలి పాత్రలో పూజ హెగ్డే కనిపించనుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus