నిర్మాత…అలా చెయ్యడం…సిగ్గు చేటు…!!!

నిర్మాత అంటే….ఎంతో ప్యాషన్ తో, ఓర్పుతో….మంచి కధలను తనకు వీలైంత వరకూ ప్రేక్షకులకు అందించే వ్యక్తి….అయితే ఒకప్పటి నిర్మాతలకు మంచి అభిరుచి ఉండేది…కానీ ఇప్పుడు నిర్మాత అంటే ఒక క్యాషియర్…నిర్మాత అంటే డబ్బు సంపాదించడానికి సినిమా తీసే ఒక వ్యక్తి…ఆయితే సినిమా అంటే బిజినెస్ అయిపోయిన పరిస్థితుల్లో నిర్మాతలు డబ్బుల కోసం సినిమాలు తియ్యడం సహజమే…కానీ కొందరు నిర్మాతలు…మరీ దిగజారిపోతున్నారు….విలువలు మరచి తమ వద్ద పనిచేస్తున్న వారిపై కన్ను వేసి….ఇబ్బందులకు గురి చేస్తున్నారు…విషయం ఏమిటంటే…సినిమా అంటే పిచ్చితో, సినిమాపై వ్యామోహంతో సినిమా పరిశ్రమ చుట్టూ తిరిగే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది…అదే క్రమంలో ఆ పిచ్చిని కొందరు క్యాష్ చేసుకునే దిశగా ప్లాన్ వేస్తూ ఉంటారు….ముఖ్యంగా అమ్మాయిలను తమ లైంగిక వాంఛలు తీర్చితే సినిమా చాన్స్ లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసే బ్రోకర్లు, బడా బాబులు చాలా మంది ఉంటారు.

ఇలా సినిమాలపై మోజుతో స్టూడియో చుట్టూ తిరుగుతూ చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకునే అమ్మాయిలను తమ బలహీనతను కొంత మంది బ్రోకర్లు క్యాష్ చేసుకుంటారు…ఇప్పుడు మనం చదవనున్న కధ కూడా అలాంటిదే….అవును ఒక నిర్మాత అమ్మాయిపై కన్ను వేసి లైంగికంగా వేధించాడు…..అయితే ఆ నిర్మాతను ఆ అమ్మాయి బంధువులు వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారు…ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. మ్యాటర్ లోకి వెళితే….  ‘ప్రీతి మాయ హుషారు ” అనే చిత్రాన్ని వీరేష్ అనే నిర్మాత నిర్మిస్తున్నారు. అక్కడే పని చేస్తున్న ఒక  అందమైన అమ్మాయిని రోజు ఇబ్బంది పెడుతున్నాడు వీరేష్…నిన్ను హీరోయిన్ ని చేస్తాను అంతేకాదు నాకు తెలిసిన అగ్ర నిర్మాతల కు కూడా చెప్పి వాళ్ళ సినిమాల్లో కూడా హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తాను అంటూ చెబుతూనే….అదే క్రమంలో ముందుగా తన కోరిక తీరిస్తే కానీ ఆ ఛాన్స్ ఇవ్వను అంటూ పదేపదే పోరు పెడుతూండటం తో చేసేది లేక ఇంట్లో చెప్పింది . విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి బంధువులు సదరు నిర్మాతను మర్యాదగా పిలిచి డబ్బిడి…దిబ్బిడి…చేసి….ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో అతడ్ని అప్పగించారు. అదన్న మాట మ్యాటరు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus