Trinadha Rao Nakkina: ‘ధమాకా’ దర్శకుడి కొత్త సినిమా ఇదేనా? ఆ ఇద్దరు కాకుండా వేరే హీరోతో..!

  • January 11, 2024 / 01:57 PM IST

స్టార్‌ హీరోతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టి.. రికార్డు వసూళ్లు సాధించినా ఆ దర్శకుడి నెక్స్ట్‌ సినిమా ఓకే అవ్వడానికి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో త్రినాథరావు నక్కిన కూడా ఉన్నారు. రవితేజతో ‘ధమాకా’ సినిమా చేసి అదరగొట్టిన త్రినాథరావు కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టలేదు. ఈ లోపు రవితేజ సినిమాల మీద సినిమాలు చేసి రిలీజ్‌ చేసేసి, కొత్త సినిమాల పనిలో పడ్డాడు. త్రినాథరావుకు ఇప్పుడు సినిమా ఓకే అయ్యింది అంటున్నారు.

‘ధ‌మాకా’తో భారీ విజయంతో పెద్ద‌ నిర్మాత‌లు, స్టార్‌ హీరోల దృష్టి త్రినాథరావు నక్కిన మీద ప‌డింది. కానీ ఏమైందో ఏమో ఇంకా సినిమా ఓకే అవ్వలేదు. అయితే ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు అని టాక్‌ వినిపిస్తోంది. అయితే తొలుత వార్తలొచ్చినట్లు స్టార్‌ హీరోతో కాకుండా యంగ్‌ ప్రామిసింగ్‌ హీరోతో సినిమా చేస్తారు అని అంటున్నారు.‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం’, ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ సినిమాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుగాంచిన రాజేష్ దండా నిర్మాత‌.

న‌రేష్‌తో ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ అనే సినిమా నిర్మిస్తున్న ఆయన (Trinadha Rao Nakkina) త్రినాథరావు నక్కినతో సినిమా చేస్తారట. ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చారట. త్రినాథరావు ఆస్థాన రచయిత ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ఈ మేరకు ఓ క‌థ సిద్ధం చేశారట. స్క్రిప్ట్‌ను దాదాపు ఫిక్స్‌ చేసేశారట. హీరో కోసం వరుస ప్రయత్నాలు చేస్తున్నారట టీమ్‌. గతంలో నాగ‌ శౌర్య‌, శ్రీ‌విష్ణు పేర్లు వినిపించాయి ఈ సినిమా గురించి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని తెలుస్తోంది.

యూత్‌ను టార్గెట్‌ చేస్తూ సినిమాలు చేస్తున్న ఓ యువ హీరోతో త్రినాథరావు నెక్స్ట్‌ మూవీ ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పటికే మాటలు జరిగాయని, త్వరలో క్లారిటీ వస్తుందని, అప్పుడే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. మరి ఆ హీరో ఎవరు, ఆ కథ ఏంటి అనేది చూడాలి. న‌క్కిన త్రినాథ‌రావు – ప్ర‌స‌న్న‌ కుమార్ కాంబో అంటే వినోదం. కాబట్టి అలాంటి కథే వస్తుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus