Trisha Remuneration: వామ్మో.. త్రిష రెమ్యునరేషన్ అంత పెరిగిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కావడంతో పాటు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్1 సక్సెస్ తో త్రిషకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. కొత్త మూవీ ఆఫర్లు వస్తుండటంతో త్రిష తన రెమ్యునరేషన్ ను డబుల్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నాలుగు పదుల వయస్సులో కూడా త్రిష వరుస ఆఫర్లను అందుకుంటున్నారు.

రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన త్రిష మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా వల్ల ప్రస్తుతం మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం వరకు ఈ నటి రెమ్యునరేషన్ కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉండేదని సమాచారం అందుతోంది. విజయ్, అజిత్ లకు జోడీగా ఆఫర్లు వస్తుండటంతో త్రిష తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారని తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్ మూవీలో యువరాణి కుందవై పాత్రలో అద్భుతంగా నటించి త్రిష ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ఐదేళ్లుగా సరైన సక్సెస్ లేని త్రిషకు పొన్నియన్ సెల్వన్ సక్సెస్ ఎంతగానో ప్లస్ అయింది. త్రిష టాలీవుడ్ ఆఫర్లకు కూడా ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకులకు కష్టమవుతోంది. సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి నయనతార ఓకే చెబుతున్నా ఆమె రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడంతో చాలామంది దర్శకనిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు.

త్రిష మరికొన్ని సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ గా హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు త్రిష పెళ్లి గురించి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాల్సి ఉంది. త్రిష పాత్రల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus