పెళ్ళంటూ చేసుకుంటే.. అదే చేస్తా : త్రిష

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు… వాళ్ళ టైం నడుస్తున్నప్పుడే దాదాపు రాణించాలని వారు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వారి పెళ్ళి విషయాన్ని సైతం పక్కన పెట్టేస్తారు. బాలీవుడ్ లో ఈ పరిస్థితి ఎక్కువ ఉండదు. అక్కడ పెళ్ళైనా కూడా హీరోయిన్లకు క్రేజ్ తగ్గదు. కానీ సౌత్ లో అలా కాదు. అందుకే దాదాపు 17 ఏళ్ళ నుండీ ఇండస్ట్రీలో ఉన్న త్రిష సైతం ఇదే ఫాలో అవుతుంది. ఈమెకు పోటీగా చాలా మంది కుర్ర భామలు, క్రేజీ భామలు వస్తున్నప్పటికీ.. మంచి కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది.. హిట్లందుకుంటుంది.

ఇది పక్కన పెడితే.. ఇటీవల తన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చట్లు పెట్టింది త్రిష. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది త్రిష. ‘నాకు కూడా కొన్ని కలలు ఉన్నాయి. వివాహ వ్యవస్థ పై నాకు నమ్మకం లేదు. నాకు నచ్చిన మగాడు దొరికితే… వెగాస్ లో పెళ్ళి చేసుకుంటాను. అదే నా క్రేజీ డ్రీమ్” అంటూ పేర్కొంది ఈ చెన్నై బ్యూటీ. ఇక త్రిష ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్లో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం అలాగే మోహన్‌ లాల్‌ తో ‘రామ్‌’ సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus